Weekend Tour Package : వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి..
అలాంటి వారి కోసమే ఈ సమాచారం. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాల కు మేము తీసుకెళ్తున్నాం. వాటి గురించి తెలుసుకొని రాబోయే వీకెండ్స్ లో వెళ్లడానికి ప్లాన్ చేసుకోండి. ఇవి కేవలం ఒక్క రోజుల్లో తేలిగ్గా వెళ్లి తిరిగి రాగల పర్యటక ప్రదేశాలు. కావున ఉద్యోగాలు చేసేవారు చాలామంది
దర్శనం మరియు ఎంట్రీ టికెట్స్, ఫుడ్ ఇవన్నీ కూడా ప్యాకేజీలో కవర్ అవుతాయి. టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం 6 గంటలకు బషీర్ బాగ్ లోని సీఆర్ ఓ కార్యాలయం నుండి బస్సు బయలుదేరుతుంది. ఉదయం 9 గంటలకు కొండ పోచమ్మ రిజర్వాయర్ కు మీరు చేరతారు. మార్గం మధ్యలోనే బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకు కొండ పోచమ్మ రిజర్వాయర్ నుండి మీరు బయలుదేరుతారు. అనంతరం 11:00 గంటల తరువాత కొమర వెళ్లి చేరుకొని అక్కడ ఉన్నటువంటి గుడిలో మీరు దర్శనం చేసుకుంటారు.
అక్కడ దర్శనం చేసుకున్న తరువాత వేములవాడకు మీరు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో వేములవాడకు చేరతారు. మధ్యాహ్నం 2:00 గంటల నుండి 4:00 గంటల వరకు దర్శనం లంచ్ అనేది ఉంటుంది. దాని తరువాత సాయంత్రం 4:00 గంటలకు వేములవాడ నుండి బయలుదేరుతారు. తిరిగి సాయంత్రం 5:00 గంటలకు కొండగట్టు చేరతారు.
తరువాత 6:00 గంటల వరకు దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరిగి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 10 గంటల టైమ్ లో మీరు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ టూర్ ప్యాకేజీ కేవలం ఒక్క రోజుల్లో ముగుస్తుంది కాబట్టి. మీరు కూడా టికెట్ బుక్ చేసుకొని వీకెండ్ టూర్ ను ఎంజాయ్ చేయండి..