Zodiac Signs: శుక్రుడి రాక‌తో దీపావ‌ళికి ముందే ఈ రాశుల వారికి డ‌బ్బే.. డ‌బ్బు.! ఇందులో మీరు ఉన్నారో లేదో తెలుసుకోండి.

Zodiac Signs: శుక్రుడి రాక‌తో దీపావ‌ళికి ముందే ఈ రాశుల వారికి డ‌బ్బే.. డ‌బ్బు.!  ఇందులో మీరు ఉన్నారో లేదో తెలుసుకోండి.

Zodiac Signs: ద‌స‌రా న‌వ‌రాత్రులు పూర్త‌య్యాయి. ఈ నెల 12న విజ‌య‌ద‌శ‌మి పండుగ కూడా ముగిసింది.. అయితే సంప‌ద‌కు మూల‌కార‌కుడు అయిన‌ శుక్ర‌డు వృశ్చిక రాశిలోకి ప్ర‌వేశించాడు. దీంతో కొన్ని రాశుల వారికి దీపావ‌ళికి ముందే ధ‌న‌యోగం రానుంద‌ని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే శుక్రుడు ఎల్ల‌ప్పుడు నిర్థిష్టంగా ఉండ‌కుండా త‌ర‌చూ మారుతూ ఉంటాడు. 

దీనివల్ల 12 రాశుల వారిపై ప్ర‌భావం ఉంటుంద‌ని పండితులు స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే కొన్ని రాశుల వారికి మాత్ర‌మే సంప‌ద‌, ఆనందం, సుఖ సంతోషాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. అంటే కొన్ని రాశుల వారిపై శుభ‌ప్ర‌యోజ‌నం ఉండ‌గా మ‌రికొన్ని రాశుల వారిపై అశుభ ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయ‌ని పేర్కొంటున్నారు. ఈ జాబితాలో 5 రాశుల వారికి మాత్ర‌మే అదృష్టం వ‌రిస్తుంది. ఇక శుభ ప్ర‌యోజ‌నాలు క‌లిగే రాశుల వారి జాబితాలో మీరు ఉన్నారో లేదో తెలుసుకోండి..

Read Also Rasi Phalalu: త్వరలోనే ఈ రాశుల వారి పై డబ్బుల వ‌ర్షం కురిపించునున్న శనీశ్వరుడు?

16 -02

వృష‌భ రాశి:

శుక్రుడి సంచారం వ‌ల్ల వృష‌భ రాశి వారికి గొప్ప విజ‌యాల‌ను అందించ‌నుంది. ఈ రాశివారికి ఆరోగ్య, ఆర్థిక స‌మ‌స్య‌లు తీరనున్నాయి.  మీరు తీకునే నిర్ణ‌యాలు క‌చ్చితంగా అనుకూల ఫ‌లితాల‌ను అంద‌జేస్తాయి. ఈ రాశివారికి  సిరిసంప‌ద‌లు సిద్ధిస్తాయి. ఊహించని లాభాల‌ను చ‌విచూస్తారు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల నుంచి విముక్తి ల‌భిస్తుంది. కుటుంబ స‌మ‌|స్య‌లు, వివాదాలు స‌మ‌సిపోతాయి. డ‌బ్బు, ఖ‌ర్చుల విష‌యాల ప‌ట్ల త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

16 -03

సింహ‌రాశి:

శుక్ర సంచారం సింహ‌రాశి వారికి మేలు చేయ‌నుంది. నూత‌న వాహ‌నాలు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపార‌స్తులు చేతినిండా డ‌బ్బులు సంపాదిస్తారు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు చేసే వారికి శుభ‌వార్త‌లు వినిపిస్తాయి. విదేశాల‌కు వెళ్లాల‌నుకునే వారికి మంచి స‌ద‌వ‌కాశాలు రానున్నాయి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. లాభాలు గ‌డించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

16 -04

 క‌ర్కాట‌క రాశి:

 క‌ర్కాట‌క రాశి వారిప‌ట్ల ప్రేమ‌, వైవాహిక సంబంధాల్లో శుక్రుడి శుభ‌ ప్ర‌భావం ఉంటుంది. ప్రేమికులు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. విద్యార్థుల‌కు మంచి అనుకూల ప్ర‌భావం ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు మెండుగా ఉంటాయి. కుటుంబ స‌భ్యుల స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. వ్యాపారులు పెట్టుబ‌డులు పెడితే లాభాలు గ‌డించే అవకాశం ఎక్కువ‌గా ఉంది. 

16 -05

వృశ్చిక రాశి:

శుక్రుడి సంచారం వృశ్చిక రాశిలోనే జ‌రుగ‌బోతోంది. అందువ‌ల్ల ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఏప‌ని త‌ల‌పెట్టినా అన్నీ శుభాలే జ‌రుగుతాయి. ఖ‌రీదైన వ‌స్తువులు, విలువైన వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. కొత్త‌గా వివాహం చేసుకున్న దంప‌తుల‌కు సంతానం క‌లిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆర్థిక విష‌యాల్లో మ‌న‌సు సంతృప్తి క‌రంగా ఉంటుంది. దీపావళి పండుగ ఈ రాశివారికి ముందుగానే వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది.

16 -06

మ‌క‌ర రాశి:

మ‌క‌ర రాశి వారికి శుక్రుడు విజ‌యాన్ని అందించ‌డంలో కీల‌కంగా ఉంటాడు. వృత్తి, వ్యాపారంలో అనుకూల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. విద్యా, ఉద్యోగాల్లో విజ‌య అవ‌కాశాలు మెండుగా ఉంటాయి. వీరు అనుకున్న ప‌నుల‌న్నీ నెర‌వేరుతాయి. ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్న‌తాధికారులు అండ‌గా ఉంటారు.

నోట్ :  పైన పేర్కొన్న రాశుల వారికి జ్యోతిష్య పండితుల ప్ర‌కారం అనుకూల‌, ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను వివ‌రించ‌డం జ‌రిగింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం
Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ...
Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?
Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా కార్తీక మాసం ప్ర‌త్యేక‌ పూజలు... పుణ్య స్నానాలే?
US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!
BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!
Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?