Rasi Phalalu: త్వరలోనే ఈ రాశుల వారి పై డబ్బుల వర్షం కురిపించునున్న శనీశ్వరుడు?
2025లో శని గ్రహం అనేది మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. శని పది రోజుల్లో అంటే నవంబర్ 15న ప్రత్యక్షంగా మారిపోతున్నాడు. దీంతో ఏళ్లనాటి శని ప్రభావం ఉన్నఈ రాశులపై దాని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. శనిసంచరించే రాశికి అనుగుణంగా ఏలినాటి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటాయి. ఈ ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు మూడు దశల పాటు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏలినాటి శని కుంభ, మీనా మరియు మకర రాశిలలో ఉంది. ఈ మకర రాశి పై ఏలినాటి శని చివరి దశ నడుస్తుంది.
కుంభరాశి
శని ప్రత్యక్ష సంచారం వల్ల కుంభ రాశి వారికి పురోగతి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్న అవి తొలగిపోతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి రోజులనేవి ప్రారంభమవుతాయి.
మకర రాశి
ఈ మకర రాశి వారు ఆదాయపరంగా మంచి లాభాలను పొందుతారు. మీకు తెలియని చోట నుండి లాభం కూడా వస్తుందని మీకే తెలియదు. కేవలం పది రోజులు ఓపిక పడితే చాలు ఈ రాశి వారికి అన్ని మంచి శకునాలు.
మీన రాశి
మీన రాశి వారికి శని సంచారం కూడా మంచి మార్పులను తీసుకువస్తుంది. అనేక రకాల విషయాల్లో మీకు సులభతరం అవుతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన నష్టం నుంచి విముక్తి పొంది మీరు లాభాల దిశగా ప్రయోజనం పొందుతారు. మొత్తం మీద శని ప్రత్యక్షంగా ఉండడం మీకు శుభ ప్రధముగా ఉంటుంది. నీకు సమాజంలో గౌరవంకూడా లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా బాగానే పెరుగుతాయి.