వేములపల్లి, ఏప్రిల్ 10 (క్విక్ టుడే న్యూస్):- సల్కునూరు గ్రామం బొమ్మకల్లు రోడ్లో ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య, సిపిఐ మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, రైతు సంఘం జిల్లా సమితి సభ్యులు మద్దిరాల రంగారెడ్డి, మద్దిరాల వెంకట్ రెడ్డి తదితరులు సందర్శించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఐకెపి కేంద్రాలలో ధాన్యాన్ని తోలి పది, పదిహేను రోజులు కావస్తున్న రైతుల ధాన్యాన్ని కాంటా వేయడంలో కాలయాపన చేస్తున్నారు అని వారు అన్నారు. నిన్న వచ్చి కొబ్బరి కాయలు కొట్టి, ప్రారంభిస్తున్నామని ప్రకటించు పోవడం జరిగిందని వారన్నారు. ఎటు చుసిన అన్ని వడ్లరాసులే అకాల వర్షం వచ్చినట్లయితే ఆ రాశులకు భద్రత లేదని, దాని వలన రైతులు పూర్తిగా నష్టపోతారని వారన్నారు. ఐకెపి కేంద్రానికి సంబంధించినటువంటి వారు యుద్ధ ప్రాతిపదిక పైన రాశుల మీదికి పట్టాలు ప్రొవైడ్ చేయాలని వారన్నారు. హమాలీలు లేరని, బస్తాలు రాలేదని, లారీలు దొరకలేదని, ఇలాంటి కుంటి సాకులు చెప్పినట్లయితే నష్టపోయేది రైతులు మాత్రమేనని వారన్నారు. రైతులు నష్టపోకుండా ఉండాలంటే వెంటనే కాంటా వేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, జిల్లా సమితి సభ్యులు మద్దిరాల ర్యాంక రంగారెడ్డి, మద్దిరాల వెంకటరెడ్డి, రైతులు రోశయ్య, సత్యం, సైదులు, చిట్టి, యశోద, లింగమ్మ, లక్ష్మమ్మ, కలమ్మ, ఎల్లయ్య, రాణమ్మ, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
