అంతరాలు లేని విద్యను అందించడమే యుటిఎఫ్ లక్ష్యం!..

అంతరాలు లేని విద్యను అందించడమే యుటిఎఫ్ లక్ష్యం!..

తొర్రూరు, ఏప్రిల్ 13 :- అంతరాలు లేని విద్యను అందించడమే యుటిఎఫ్ లక్ష్యంమని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా కోశాధికారి నాగమల్లయ్య లు అన్నారు. ఆదివారం స్థానిక పట్టణ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ నాయకురాలు కొండ బత్తుల రాధాదేవి యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మురళి కృష్ణ, నాగమల్లయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ లక్ష్యాలతో హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా ప్రాంతాలు యాజమాన్యాలు క్యాడర్లు మతాలు కులాలు అతీతంగా ఉపాధ్యాయులందరికీ ఒకే సంఘం ఉండాలనే చారిత్రక నేపథ్యంలో ఆవిర్భవించి మహనీయుల త్యాగాల వారసత్వంలో ప్రభుత్వ విద్య అభివృద్ధి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాటాలు నిర్వహించి ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించిందన్నారు. సమాజంలో అంతరాలు లేని విద్యను అందించడం కోసం కృషి చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చైతన్య కార్యదర్శులు రాయలు ,వనజ, సుల్తానా బేగం, మౌనిక, మమత, స్రవంతి, పల్లవి, యమునా, వెంకటేశ్వర్లు, వంశీ, రజనీకాంత్, రంజిత్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250413-WA0035

Read Also ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?