Diwali festival: ఆనందాల పండుగ దీపావళి..ఆరోజునే దీపాలు వెలిగించి, టపాసులు ఎందుకు పేల్చుతారో తెలుసా?
మన భారతదేశంలో హిందువులు మొత్తం కూడా ఎంతో ఘనంగా జరుపుకునే ప్రతి పండుగకు పురాణాల ప్రకారం చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. దీపావళి పండుగను దీపాల పండుగ అని కూడా అంటారు. ఎన్ని పేర్లతో పిలుచుకున్న ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అష్టదశ పురాణాల ప్రకారం దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం. అందుకే దీపావళి రోజున ఎక్కువగా దీపాలతో ఇంటిని అలంకరిస్తూ ఉంటారు.
అసూయ బహుళ చతుర్దశి రోజున అంటే అక్టోబర్ 30వ తారీఖున దీపాల పండుగ ప్రారంభమవుతుంది. ఇక అప్పటినుంచి ఈ కార్తీకమాసంలో కూడా సంధ్య సమయంలో అంటే సాయంత్రం సమయాల్లో ప్రమిదలలో నూనె కానీ ఆవు నెయ్యి కానీ నింపి దీపాలు అనేవి వెలిగిస్తారు. ప్రతి దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర లేదా దేవుడి దగ్గర దీపాలు అనేవి పెడతారు. సైన్స్ ప్రకారంగా మనం కనుక పరిశీలిస్తే ఈ సమయంలో చలి అనేది ఎక్కువగా మొదలవుతుంది.
కాబట్టి శీతాకాలం ప్రవేశంతో జలుబు మరియు దగ్గు మొదలగు శ్వాస కోసం వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మనం దీనికి విరుగుడుగా అంటే ఇలాంటి వ్యాధులు రాకుండా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించిన దీపపు పొగను పీల్చడం వల్ల ఈ వ్యాధులు అనేవి మన దరిదాపుల్లోకి రావని అర్థం. అలాగే ఆ దీపం సెగ తగిలిన ఇలాంటి వ్యాధులనుంచి మనం చాలా దూరమవుచ్చని ఆయుర్వేద నిపుణులు ఎక్కువగా చెబుతున్న విషయం ఇది.
నీకు అలాగే మనం టపాసులు ఎందుకు కాలుస్తామని విషయానికి వస్తే... రామాయణంలో శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజని అలాగే సత్యభామ నరకాసురుని చంపిన తర్వాత రోజు అందరూ సంబరాలతో ఆ యొక్క ఆనందం నీ టపాసులు కాల్చుకుంటూ మనందరికీ కూడా చూపిస్తున్నటువంటి పురాణాల కథ ఇది. కాబట్టి ఈ కథ ఆధారంగానేమనం టపాసులు అనేవి కాల్చడం మొదలుపెట్టాం.
ప్రకృతి పరంగా పరిశీలిస్తే మన దేశం వ్యవసాయదారి దేశం. వర్షాకాలంలో విత్తిన పంటలు శీతాకాలంలోనే వృద్ధి చెందుతాయి. దీపావళి పండుగ శీతాకాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి ఏమైనా క్రిములు లేదా కీటకాలు పంటలను నాశనం చేస్తాయి. ఈ సందర్భంగా దీంతో పంట దిగుబడి అనేది భారీగా తగ్గిపోయి రైతు ఆదాయం కూడా తగ్గిపోతుంది.
తీవ్ర నష్టాన్ని వ్యవసాయదారులు అనగా రైతులు చవిచూస్తారు కాబట్టి అలాగే వీటితోపాటుగా ప్రజలకు కీటకాలు వల్ల అనారోగ్యం కలుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా నాశనం చేసేందుకు టపాసులు కాల్చిన సందర్భంలో ఆ టపా కాయలలో గంధకం అనె రసాయనం ఉంటుంది కాబట్టి అది గాల్లో కలిసినప్పుడు ఆ పవను మనం పీల్చుకోవడం వల్ల ఆ కీటకాల వ్యాధి బారి నుండి మనం తప్పించుకోవచ్చు.
ఇక అలాగే మనం దీపావళి రోజున ఎక్కువ లక్ష్మీ పూజ చేసేటువంటి సందర్భాలు చాలాసార్లు చూసి ఉంటాం. ఎందుకంటే దీపావళి రోజున లక్ష్మీ పూజలు చేస్తే ఎక్కువగా సిరిసంపదలు కలుగుతాయని మన వేద పండితులు చెబుతున్న విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరో వారంలో రాబోయేటువంటి దీపావళి రోజున అందరూ కూడా లక్ష్మీదేవికి పూజలు అభిషేకాలు చేయాలని పురాణాల్లో రాసి ఉంది అలాగే ఇప్పటి పూజారులు కూడా చెప్పుకొస్తున్నటువంటి విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు దైవాను భక్తుతో దీపావళి రోజున లక్ష్మీదేవి కి పూజలు అనేవి చేయండి.