karthika masam: ఆహా.. కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
కార్తీక్ మాసం సందర్భంగా కృష్ణ మరియు గోదావరి తీరాలలో భక్తులందరూ కూడా పుణ్యా స్నానాలు చేస్తూ సందడి నెలకొల్పుతున్నారు. అంతేకాకుండా ఈ గోదావరి మరియు కృష్ణా నది తీరాలలో ఎక్కువగా రద్దీ కూడా నెలకొంటుంది. ప్రముఖ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తుండడంతో అన్ని దేవాలయాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. అందరు స్వాముల అనుగ్రహం కోసం రుద్రాభిషేకాలు మరియు మహా రుద్రాభిషేకాలు అలాగే బిల్వార్చనలుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దైవ భక్తిలో మునిగి తేలుతున్నారు.
కార్తీక మాసం సందర్భంగా కార్తీకదీపం వెలిగిస్తూ ఆ ముక్కంటి కృప కటాక్షలు తమపై ఎల్లవేళలా ఉండాలని భక్తితో కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడా శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అనేది ఎక్కువగా నేలకుంది. ఈ స్వామివారికి గోపూజ మరియు మహాన్యాస పూర్విక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో రెండుసార్లు సత్యనారాయణ వ్రతం నిర్వహించేందుకు అధికారులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు.
ఇక భక్తుల రద్దీ దృశ్య గర్భాలయంలో అర్జిత మరియు అన్న పూజ సేవలు రద్దు చేశారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి మొదటి సోమవారం సందర్భంగా క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇక భద్రాచలంలోని గోదావరి తీరంలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించి ఆ గోదావరి నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని శివ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఇక దోర్నాలలో ఉన్నటువంటి ఈ శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలి వెళ్లి పుణ్య స్థానాలను ఆచరించి ఇష్టంగా కార్తీకదీపం వెలిగించి దేవుడిని దర్శించుకుని మరీ వస్తున్నారు. దీంతో ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా భక్తుడు భారీగా తరలివస్తుండడంతో ప్రభుత్వాధికారులు కూడా భారీగానే బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఇక అలాగే హైదరాబాదులోని శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు కార్తీకదీపంలు వెలిగించి స్వామివారిలకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఇక నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి ఉండడంతో ఎక్కువమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఈ క్షేత్రాలకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.