Ravana: రావణుడు చనిపోతున్నప్పుడు చెబుతున్న మాటలకి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే?
శ్రీరామ నీకంటే నేను అన్నిట్లో కూడా గొప్పవాడినే అలాగే నాది బ్రాహ్మణ జాతి. నీదేమో క్షత్రియ జాతి , నీ కంటే నేను వయసులో పెద్దవాడిని అలాగే నా కుటుంబం కూడా చాలా పెద్దది అలాగే నీ అంతపురం స్వర్ణమైతే, నా లంక నగరం కూడా పెద్ద స్వర్ణమయమే అని చెప్పుకొచ్చాడు. అన్నిట్లో కూడా నీ కంటే నేను ముందే ఉన్నాను. అయినా కూడా ఈ యుద్ధంలో నీ ముందు నేను తలవంచక తప్పలేదు నువ్వే ఈ యుద్ధం గెలిచావని చనిపోతున్న సందర్భంగా చెప్పుకొచ్చాడు రావణుడు. ఇక దీనికి ఒకే ఒక కారణమని కూడా రావణుడు చెప్పాడు. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ యుద్ధం నేను గెలవకపోవడానికి నువ్వు గెలవడానికి నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు నా తమ్ముడు మాత్రం నా వద్ద లేకపోవడం వల్లనే ఈ యుద్ధం ఓడిపోయానని చెప్పుకొచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనందరం కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కుటుంబం దూరమైతే బతికే భారమవుతుంది కాబట్టి కుటుంబాన్ని ఎవరు కూడా విడిపోవాలని కోరుకోకండి. కుటుంబ కలహాల మధ్య ఏకంగా రావణుడి లాంటివాడే యుద్ధంలో ఓడిపోయాడండి మనం కచ్చితంగా ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో కలిసి ఉండండి. ఇటువంటి కలహాలను కుటుంబంలో తీసుకురాకండి.
కాబట్టి మనకు తోడుగా ఒక నలుగురు ఉంటే కచ్చితంగా దేనిని మనం దాటవచ్చు, ఎదుర్కొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు విడిపోవాలని కోరుకోకండి. ఎంత వీలైతే అంత దగ్గరగా అందరితో కలిసి మెలిసి ఉండండి. ఇప్పుడు కూడా జీవితంలో స్వార్థపరుడిగా ఉండకండి. ఉన్నన్ని రోజులు సంతోషాలతో అలాగే బంధువులతో, మిత్రులతో కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. చిన్న గొడవలు కారణంగా కుటుంబాలు విడిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకొని ఇప్పటినుండి అయినా సక్రమంగా నడుచుకొండి.