Baba Vanga Predictions: 2025 సంవత్సరంలో జరగబోయే విషయాలు తెలుసా?.. అంతా దైవేక్ష!
బాబా వెంగ అంచనా ప్రకారం 2025 సంవత్సరంలో ప్రపంచ వినాశనం జరుగుతుందని చెప్పారు. ఆమె చెప్పిన ప్రకారం మనం కనుక చూసుకుంటే కచ్చితంగా 2025వ సంవత్సరం అతి భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె చెప్పినటువంటి మాటలనేవి చాలానే నిజమయ్యాయి. కాబట్టి ఈ బాబా వెంగ చెప్పేటువంటి భవిష్యత్తు మాటలు అన్ని కూడా నిజమే అని అనుకుంటున్నారు చాలామంది. అయితే ఈ బాబా వెంగ 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో అనే కొన్ని విషయాలను తెలిపింది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈమె చెప్పిన వాటిల్లో ముఖ్యంగా ఐరోపా నాశనం అవుతుందట. ఇక అంతేకాకుండా ఎక్కువగా శాస్త్రీయ పురోగతి, టెలికాం అభివృద్ధి, గ్రహాంతర జీవితం, అలాగే ప్రపంచ సంక్షోభం లేదా అపోకలిప్స్ ప్రారంభం కానున్నాయట. అయితే ఏం చెప్పిన ప్రకారం కచ్చితంగా నిజమైతే ఐరోపాలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దీనివల్ల భారీ స్థాయిలో విధ్వంసం జరగడంతో ఎక్కువమంది మరణించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా భూమి వెలుపల కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడంతో మానవులు విజయం సాధించవచ్చు. కాబట్టి టెలికామాభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక అదే విధంగా గ్రహాంతర జీవులతో కమ్యూనికేషన్ సాధ్యమవుతుండడంతో మానవ అవయవాలు ప్రయోగశాలలో తయారుచేయబడతాయి.
కాబట్టి ఇలాంటివి జరిగితే కచ్చితంగా 2025వ సంవత్సరంలో భూమిని నాశనం చేసే విధ్వంసానికి నాంది అవుతుందని అనవచ్చు. మానవత్వం పూర్తిగా నాశనం కానప్పటికీ దాని ముగింపు ప్రారంభమవుతుందట. కాబట్టి ఈమె చెప్పిన విషయాలన్నీ కూడా భవిష్యత్తులో జరుగుతాయో అనే ఆందోళన ఇప్పటికే చాలామంది లో నెలకొంది. ఈ బాబా వంగా అనేవారు బల్గేరియాలో జన్మించిన ప్రసిద్ధ ప్రవక్త. ఈమె జనవరి 31న 1911 లో జన్మించారు. చిన్నతనంలోనే చూపు కూడా కోల్పోయారు. ఇక ఆ తర్వాత ఆమె అంచనా వేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమైంది. కాబట్టి ఆమె భవిష్యత్తులో చెప్పేటువంటివి అన్నీ కూడా నిజమవుతాయని ఆలోచనలో చాలా మంది ఉన్నారు.