CM Revanth Reddy: అవసరమైతే రోబోల సాయం తీసుకోండి
ఆదివారం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను మంత్రుల బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రక్షణ చర్యలకు సంబంధించి బృందాలను సీఎం ఆరా తీశారు. సహాయక చర్యలను సీఎంకు రెస్క్యూ టీమ్ అధికారులు వివరించారు. కాసేపు సొరంగ మార్గంలో పనులను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బయటకు వచ్చి సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. ఆపరేషన్‌లో ఇబ్బందులను సీఎం రేవంత్‌కు రెస్క్యూ టీమ్ వివరించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి తన అభిప్రాయాలు రెస్క్యూటీమ్‌తో పంచుకున్నారు.
ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా రూపొందించుకోవాలని, ప్రధాని మోదీ కూడా తరచూ సహాయ చర్యలపై ఆరా తీస్తున్నారని, తాను ప్రధానిని కలిసినప్పుడు ఆయన వివరాలు అడిగారని తెలిపారు. ఇంకా ఏదైనా సహాయం కావాలంటే ఉత్తమ్‌ను అడగాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ అంశం గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. ఆపరేషన్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని డాక్యుమెంట్‌గా మార్చాలని తెలిపారు. సమయం వృథా కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎంకు అధికారులు తెలిపారు.