Darsh Amavasya: మీకు ఎక్కువ కష్టాలు ఉన్నాయా?.. ఈ దర్శ అమావాస్య రోజు ఇలా చేయండి?
అంతేకాకుండా దర్శి అమావాస్యనాడు పూర్వికులు ఎవరైతే ఉంటారో వారు స్వర్గం నుండి భూమికి వచ్చి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తారని మన హిందూ పురాణాల ప్రకారం చాలామంది కూడా నమ్ముతారు. ఈ అమావాస్యనాడు పితృదోషం తొలగిపోయేలా చాలామంది చర్యలు కూడా తీసుకుంటారు. ఆరోజున ఆచారాల ప్రకారం పూజలు ఇలాంటివి చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభించే మార్గం సులభం అవుతుందని చాలామంది ప్రజల నమ్మకం.
ఈదర్శ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ చర్యలు మనం తీసుకోవడం ద్వారా పూర్వికులు సంతోషించడమే కాకుండా కోరికలన్నీ కూడా నెరవేరుతాయట. ఇక మీరు కష్టాలు మరియు దుఃఖాల నుంచి ఉపశమనం పొంది జీవితంలో ఎక్కువ ఆనందం అలాగే ఇటువంటి దిష్టి తగలకుండా ఉంటుందని హిందూమత పురాణాలు ప్రకారం చాలా మంది చెబుతున్న విషయం.
ఇక పంచాంగం ప్రకారం కార్తీక మాసం దర్ష అమావాస్య తేదీ నవంబర్ 30 ఉదయం 10 గంటల 29 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబరు ఒకటి వ తారీకు ఉదయం 11:50 నిమిషాలకు ముగుస్తుంది. కాబట్టి ఈ దర్శ అమావాస్య అనేది నవంబర్ 30న జరుపుకుంటారు. కాబట్టి పైన చెప్పిన విధంగా దర్శి అమావాస్య రోజున ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం వల్ల పూర్వీకులు ఎవరైతే ఉంటారో వారందరూ సంతోషిస్తారు.