ఇంట్లో చెద పురుగులు ఎక్కువగా ఉన్నాయా?.. అయితే ఇలా చేయండి?
అందుకే ఎప్పటికప్పుడు ఈ చెదలను తొలగించుకోవడం చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ చదలు కూడా ఎక్కువగా చలికాలంలోనే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ చదలను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొంచెం నిమ్మరసం మరియు వెనిగర్ తో ఈ చదపురుగులనేవి జీవితంలో ఇంట్లో కనపడకుండా చేసుకోవచ్చు. ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసి చదలు ఉన్నచోట మనం స్ప్రే చేసినట్లయితే వెంటనే ఇవి తొలగిపోతాయి. ఇలా వారం పాటుగా ఒకసారి మూల మూలల్లో అలాగే చెదపురుగులు ఉన్నచోట మరియు చెక్క ఎక్కువగా ఉన్నచోట స్ప్రే చేస్తే చెదపురుగులు అనేవి అసలు పట్టవు. ఈ చదపురుగులును ఎక్కువగా సిట్రస్ ఆయిల్ తో కూడా తరిమికొట్టవచ్చు.
అలాగే ఈ సిట్రస్ పండ్ల నుండి వచ్చేటువంటి వాసన అనేది చదపురుగులకు అసలు పడదు కాబట్టి వెంటనే ఇంటి నుండి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే వేప నూనెతో కూడా చదపురుగులను వదిలించవచ్చు. ఈ వేప నూనె నుండి వచ్చే వాసన అనేది ఎంతో ఘాటుగా ఉండటం వల్ల తొందరగా చదపురుగులు ఇంటి నుండి బయటకు వెళ్తాయి.