Kanguva: కంగువా కలెక్షన్లు తుస్!... మొదటిరోజు ఎంత వచ్చాయో తెలుసా ?

Kanguva: కంగువా కలెక్షన్లు తుస్!... మొదటిరోజు ఎంత వచ్చాయో తెలుసా ?

Kanguva:  ఎన్నో భారీ అంచనాల  మధ్య హీరో సూర్య నటించినటువంటి కంగువా సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కంగువా మూవీ అనేది తొలి రోజు కలెక్షన్లు అంచనాలకు తగ్గట్టుగా రాలేదు. పూర్తిగా బాక్సాఫీస్ వద్ద డీల పడిపోయింది. మొదటి రోజు సూర్య మూవీ రికార్డులు తిరగరాయడం ఖాయమని,  ఏకంగా 1500 కోట్లు ఈజీగా దాటుతాయని మూవీ యూనిట్ వెల్లడించిన విషయం మా అందరికి తెలిసిందే. 

 అయితే మొదటి రోజు సూర్య మూవీ కేవలం 50 కోట్ల వరకు కలెక్షన్లు దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. అయితే ప్రీమియర్ షో నుంచి  కంగువ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో  ఫస్ట్ డే కలెక్షన్స్ పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. దీంతో అంచనా వేసిన నీ కలెక్షన్లు రాకపోవడంతో  మూవీ యూనిట్ నిరాశ పడింది. ఇక తొలి రోజు కంగువ మూవీ వరల్డ్ వైడ్ గా  కేవలం 22 కోట్లు మాత్రమే కలెక్షన్లను రాబట్టింది. అత్యధికంగా తమిళంలో 13 కోట్ల వరకు వసూళ్లు సొంతం చేసుకున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.  ఇక టాలీవుడ్ పరంగా 6 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక హిందీలో మూడు కోట్ల 25 లక్షలు వచ్చినట్లు తెలిపారు. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

1602

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 ఇక కేరళ మరియు కర్ణాటకలో కంగు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదట. ఈ రెండు స్టేట్స్లలో సూర్య సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసిన కానీ  తొలిరోజు కేరళలో మూడు లక్షలు  మరియు కర్ణాటకలో తొమ్మిది లక్షలు మాత్రమే కలెక్షన్లను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇక వరల్డ్ వైడ్ గా కంగువ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ అనేది  400 కోట్ల వరకు జరిగినట్లుగా మనకు సమాచారం  అందింది. ఇక తొలిరోజు వసూలు పరంగా చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

 ఇక దాదాపుగా ఈ సినిమాని 350 కోట్ల బడ్జెట్ తో పిరియాడికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్  గా డైరెక్టర్ శివ ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమా లో దిషపటాని హీరోయిన్గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో బాబి డియోల్ నటించాడు. మరి ఇంత పెద్ద నటులు నటించిన కానీ సినిమా యావరేజ్ గా నిలిచేటువంటి అవకాశం  ఉంది.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?