Traffic Jam: ట్రాఫిక్ కారణంగా అత్యంత రద్దీగా ఉండే నగరాలు ఏవో తెలుసా..?
తద్వారా ఏంటంటే విద్య మరియు జాబుల కోసం లేదా ఇతర పనులు కోసం ఎక్కువగా గ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరి వస్తుంటారు. దీంతో భారీ ఎత్తున ప్రజలు ఇక్కడ నివాసం ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై ప్రయాణించాలంటేనే ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్ద నగరాలలో ఉదయం గాని లేదా సాయంత్రం గాని కార్యాలయాలకు వెళ్లాలంటే నరకంగా మారుతుందని అంటున్నారు.
ఇక తాజాగా Tom Tom అనే సంస్థ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాలు ఏవో గుర్తించింది. ఈ సమస్త చెప్పినటువంటి సమాచారం ప్రకారం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన భారతదేశంలోని అత్యధిక ట్రాఫిక్ ఉన్నటువంటి నగరాల్లో బెంగళూరు అనేది మొదటి స్థానంలో ఉంది. ఈ బెంగుళూరు అనేది మన దేశంలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలోనే ఎక్కువ ట్రాఫిక్ గా ఉండే నగరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ట్రాఫిక్ ఎక్కువగా బెంగళూరులో ఉంటుందని. ఇక్కడ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే దాదాపు 28 నిమిషాలు 10 సెకండ్లు సమయం పడుతుంది.
ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి నగరాల్లో రెండవ స్థానంలో ఉంది మహారాష్ట్రలోని పుణే నగరం. పారిశ్రామిక నగరంగా గుర్తింపు పొందినటువంటి ఈ ప్రాంతం అనేది రోజురోజుకీ జన బనేది విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి దీంతో పుణ్యం నగరంలో ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఇక్కడ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే 27 నిమిషాల 50 సెకండ్లు పడుతుంది.
ఇక దేశంలోనే అత్యంత ఎక్కువగా ట్రాఫిక్కు అయ్యేటువంటి నగరాల్లో న్యూఢిల్లీ మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే 21 నిమిషాల 40 సెకండ్లు పడుతుంది.
భారతదేశంలోనే అత్యంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి నగరాల్లో ముంబాయి నాలుగో స్థానంలో ఉంది. భారతదేశ ఆర్థిక నగరంగా పేరు పొందిన ఈ ముంబై నగరానికి రాకపోకలనేవి భారీ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి నిత్యం కూడా ఇక్కడ పది కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. 10 కిలోమీటర్లు వెళ్లాలంటే దాదాపు 21 నిమిషాల 20 సెకండ్లు పడుతుందని ఈ సర్వే తేల్చేసింది.