Garlic Health Benefits: వెల్లుల్లిని ఆయుర్వేదంతో ఎందుకు పోలుస్తారు తెలుసా!... వీటి ఉపయోగాలు తెలిస్తే షాకే?
ఈ వెల్లుల్లి ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పోషకాలు అనేవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సగటు మానవుడు అనే వాడు ముఖ్యంగా ఉదయాన్నే పడగడుపున పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల వాళ్ల యొక్క శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఒక పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు చాలానే ఉన్నాయట.
మనం ప్రతిరోజు కనుక వెల్లుల్లి ఉపయోగిస్తే మాత్రం మన చర్మ ఆరోగ్యం కాపాడడంతో పాటు, ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయట. కాబట్టి ఎవరైతే చర్మం నిగనిగల ఆడాలి అని అనుకునే వారు వీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇక అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపరచుకోవడంలో కూడా వెల్లుల్లి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందట. రోజు పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుందట. అంతేకాకుండా రక్తపోటును కూడా కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఇక వీటితోపాటుగా రోగనిరోధక వ్యవస్థ కూడా బలోపితం అవడం, బరువు తగ్గాలనుకునే వారు బరువు తగ్గడం, గ్యాస్ మరియు అజీర్ణం అలాగే మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడం, డయాబెటిస్ బాధితులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇది కచ్చితంగా ఈ వెల్లుల్లి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పులు చాలానే జరుగుతాయని వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు. అయితే ఉదయం లేచిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకొని తేనెలో కలుపుకొని తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని అలాగే వెల్లుల్లికి అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.
గర్భిణీ స్త్రీలతో పాటు ఇతర వ్యాధులకు మందులు వాడేవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే వెల్లుల్లి తీసుకోవాలి. ముఖ్య గమనిక:- పైన తెలిపిన వివరాలన్నీ కూడా కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా విషయం కచ్చితంగా డాక్టర్లను సంప్రదించి చేయడం మంచిది.