JIO Electric Bike: కేవలం 15 వేలకే ఎలక్ట్రిక్ స్కూటీ?.. ఇంటిలిజెంట్ అంబానీ ఎందుకో తెలుసా?
అయితే ముకేశ్ అంబానీ ప్రవేశపెట్టనున్న ఈ స్కూటీ ధర మరియు ఫీచర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ షాకుకు గురవుతారు. ఎందుకంటే అతి తక్కువ ధరలోనే మధ్యతరగతి కుటుంబాలకు ఈ స్కూటర్ అందేలా ముకేశ్ అంబానీ ఎంతో చాకచక్యంగా తెలివిగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ స్కూటర్కి ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ కూడా ఉందట. కాబట్టి ఎన్నో ఫీచర్లు ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ముకేశ్ అంబానీ అతి తక్కువ ధరలోనే ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు అందాలనే ఆలోచనలో తీసుకు వచ్చినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే మన భారతదేశంలో ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలనేవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇక వీటితో పెట్రోల్ కి సంబంధం లేకుండా కేవలం కొద్ది నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే కొన్ని పదిల కిలోమీటర్ల వరకు తిరగవచ్చు కాబట్టి అందరూ దీని వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక ఇదే అదురుగా తీసుకొని ముకేశ్ అంబానీ చాలా తెలివిగా మన భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అతి తక్కువ ధరతో మరియు ఎక్కువ ఫీచర్లతో కేవలం 14,999 రూపాయలకు మాత్రమే వెలుగులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ఈ స్కూటీలో లిథియం- అయాన్ బ్యాటరీ కూడా ఉండడంతో కేవలం ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 75 నుండి 100 కిలోమీటర్ల వరకు పయనిస్తుందని తెలిపారు. ఈ స్కూటర్ నగరాల్లో రోజువారి ప్రయాణానికి ఎంతో ఉపయోగం కూడా పడుతుంది.
ఇక ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 14 వేల నుండి 17వేల మధ్య వరకు ఉంటుందట. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లు ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర మాత్రమే అని అంటున్నారు. అంతేకాకుండా ఈ స్కూటర్ యువకులకు అలాగే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ జియో ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది 2025లో విడుదల చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారట. కంపెనీ ఇంకా అధికారిక తేదీని ప్రకటించకపోవడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఖచ్చితంగా 2025 సంవత్సరం మొదట్లోనే ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వస్తుందని సమాచారం అయితే అందింది.