Constipation: మలబద్ధకం సమస్య వెంటాడుతుందా?.. ఈ చిట్కాలు పాటించండి?
కొన్ని ఆహార పదార్థాల వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం అయితే పొందగలం. ఆపిల్ , బాదంపప్పు, అంజీర, బొప్పాయి, స్ట్రాబెర్రీలు మరియు చిలకడ దుంపలు తీసుకోవడం ద్వారా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. తద్వారా మనం వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్య అనేది తగ్గుతుంది. ఇక అంతేకాకుండా వీటితో పాటుగా క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, గోధుమలు, బ్రౌన్ రైస్, రాగి, చియా సీడ్స్, కందిపప్పు, పాలకూర ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం అనేది అధిక మొత్తంలో తగ్గిపోతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
తగినంత నీరు తాగడం వల్ల కూడా మలబద్ధకం నివారించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే సూప్ మరియు జ్యూస్ వంటి ద్రవ ఆహారాలు కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇక వీటితో పాటుగా దోసకాయ మరియు కర్డ్ వంటి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి తీవ్రంగా శ్రమిస్తాయి. ఇక మన జీవనశైలి కూడా తరచూ మార్చుకోవాల్సి ఉంటుంది. ఉదయం లేవగానే జాగింగ్ లేదా యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల మలబద్ధకం అనేది అధిక మొత్తంలో తగ్గుతుంది.
మలవిసర్జన కూడా వచ్చిన వెంటనే చేసేయాలి. లేకపోతే ఒత్తిడికి గురవాల్సి ఉంటుంది. కాబట్టి బద్ధకం బారిన పడిన ప్రతి ఒక్కరు కూడా యోగ మరియు ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడి తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున వెచ్చని నీరు తాగడం వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది. గమనిక: ఈ సమాచారం కేవలం డాక్టర్ల సూచన మేరకే. ఏదైనా ఇంకా అర్థం కాకుంటే మీరు డాక్టర్ను సంప్రదించి వివరంగా తెలుసుకోండి.