Mobile Recharge: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ లపై ప్రభుత్వం సరికొత్త నిర్ణయం?
ఇటీవల టెలికాం కంపెనీలన్నీ కూడా రీచార్జ్ ధరలను విపరీతంగా పెంచాయి. ఇక ఈ తరుణంలోనే టెలికాం ఆపరేటర్ల నిర్ణయాల మధ్య ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని గతంలోనే ధ్రువీకరించారు. ఇక ఈ టారిఫ్ విషయంలో ప్రభుత్వం తరఫున నీరుగా ఏమీ చేయలేమని అంతేకాకుండా ఇది టెలికాం కంపెనీల సొంత నిర్ణయంఅని కేంద్ర మంత్రి తెలిపారు. దీనికోసం స్పెషల్ గా ప్రభుత్వం ట్రై ద్వారా మాత్రమే తన స్పందనను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. కాబట్టి టెలికాం కంపెనీలకు ఇది సానుకూల వార్తగా చెప్పవచ్చు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా చాలామంది వినియోగదారులు వాళ్ళ యొక్క మొబైల్ లో కాల్ చేయడానికి మాత్రమే ఉంచాలని కోరుకుంటున్నారు. అంటే వినియోగదారులు కేవలం కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు మాత్రమే కోరుకుంటున్నాడు. కాబట్టి ఇందులో చాలా చౌకగా ప్లాన్లను పొందుతున్నారు వినియోగదారులు.
ఇక ప్రస్తుతం మొబైల్ నెంబర్ ఉంచడానికి అలాగే వినియోగదారులు నెలకు కచ్చితంగా 200 రూపాయల వరకు ఖర్చు చేయాలి. జియో ఫోన్ను కొనుగోలు చేసేటప్పుడు మాత్రం వినియోగదారులు తక్కువ ధరకు ప్లాన్ పొందుతున్నారు. ఇది కేవలం జియో ఫోన్కు మాత్రమే ఉంది. ఇతర ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ వినియోగదారులకు ఇది వర్తించదు. కాబట్టి టెలికాం సంస్థలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.