India: అత్యంత శక్తివంతమైన దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉన్నదంటే..?.
ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా నిలిచింది. అమెరికా సైన్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండటంతో పాటు దాని సైనిక స్థావరాలు ప్రపంచంలోనే అనేక దేశాల్లో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం అమెరికా సైనిక వ్యయం ఏకంగా 876 బిలియన్ డాలర్లు. ఇక రెండవ స్థానంలో రష్యా నిలిచింది. అమెరికా తర్వాత రష్యా ప్రపంచంలోనే రెండవ అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. రష్యాలో దాదాపుగా 86.3 బిలియన్ డాలర్లు సైనిక దళం ఉంది. ఇక ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన సైన్యంగా చైనా నిలిచింది.
చైనా సైనిక వ్యయం దాదాపుగా 292 బిలియన్ డాలర్లు. అలాగే చైనా వద్ద 3,166 విమానాలు మరియు 4950 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇక అత్యంత శక్తివంతమైన దేశాల్లో మన భారత్ నాలుగో స్థానంలో ఉంది. మన భారత దేశ సైనిక వ్యయం దాదాపుగా 81.3 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం భారతదేశంలో గడిచిన 10 ఏళ్లలో సైనిక సామర్థ్యాలను బాగా పెంచుకుంటుంది. ఇక ఐదు, ఆరు స్థానాల్లో దక్షిణ కొరియా,యూకే నిలిచాయి. దక్షిణ కొరియా దగ్గర 46.4 బిలియన్ డాలర్లు ఉండగా యూకే దగ్గర 68.5 బిలియన్ డాలర్లు సైన్యం ఉంది.
ఇక ఏడవ అత్యంత శక్తివంతమైన దేశాల్లో జపాన్ నిలిచింది. ప్రస్తుతం జపాన్ దగ్గర 46 బిలియన్ డాలర్ల సైన్యం ఉంది. ఇక ఎనిమిదవ స్థానంలో టర్కీ నిలిచింది. దాదాపుగా 10.6 బిలియన్ డాలర్లు సైన్యం ఉంది.
ఇక తొమ్మిదవ స్థానంలో పాకిస్తాన్ నిలువగా పదో స్థానంలో ఐరోపా దేశం నిలిచాయి. ఐరోపా దగ్గర 33.5 బిలియన్ డాలర్ల సైన్యం ఉంది.