Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు కానీ అవి ఎలా పెట్టాలి అనే మినిమం కామన్ సెన్స్ ఉండదు. అయితే వీటి కోసం కచ్చితంగా కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. 12-15-20 అనే నియమాన్ని కచ్చితంగా పెట్టుబడి పెట్టేవాడు పాటించాలి. ఎవరైతే మిలీనియరు కావాలని అనుకుంటారు వారు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టడం వెంటనే ప్రారంభించాలి.
ఇక 12-15-20 అని నియమం ఏంటి అంటే మనం పెట్టుబడి పెట్టిన దాంట్లో 12 శాతం రాబడి అనగా 15 సంవత్సరాలు నిరంతర పెట్టుబడి తర్వాత 30 ఏళ్లకు మీరు మిలినియర్ అవుతారు. అది 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే ఈ ఫార్ములాతో మీకు 40 ఏళ్లు వచ్చే సమయానికి మీరు మిలినియర్ అవుతారు. కాబట్టి 12 శాతం రాబడిన పొందగలిగే పెట్టుబడి గురించి మీరు తెలుసుకోవాలి.
అయితే ఇందుకోసం మొదటగా ప్రిఫరెన్స్ చేయాల్సిన మొట్టమొదటి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ప్రతి నెల ఒక రకమైనటువంటి పెట్టుబడి ప్రణాళికతో ఇన్వెస్ట్ చేస్తూ పోతే దీర్ఘకాలంలో మీరు ఎక్కువ రాబడిన పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ 12 శాతం వరకు రాబడినదించే అవకాశం అయితే ఉంది. మరి కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నెలకు 20000 చొప్పున 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 36 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఇక 12 శాతం వడ్డీ రేటు మొత్తం కలుపుకుంటే 65 లక్షల ఆదాయం అనేది మీకు వస్తుంది. మీ జీతం 65000 అయితే మీరు నెలకు 19500 పెట్టుబడి పెట్టాలి. వీటి ద్వారా మీరు మంచి లాభాలను కూడా పొందవచ్చు. కాబట్టి ఏదైనా కొన్ని నియమాలను పాటించి పెట్టుబడి పెట్టుకోండి.