Alcohol: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా?
Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాలలో మనం చూసే ఉంటాం. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాధ వచ్చిన లేదా సంతోషం వచ్చినా మందుబాబులు మొదటగా చేసేటువంటి పని మద్యం సేవించడం. మద్యం సేవించే వాళ్ళు ఏ అలవాటు నేను మానుకోగలరు కానీ మందు మానుకోవడానికి అసలు ఇష్టపడరు. కానీ ఈ మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి మంచిదా.. లేదా.. అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ మద్యం తాగడం వల్ల జరిగే మార్పులు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైనా ఒక వ్యక్తి మద్యం తీసుకున్న వెంటనే ఆ ఆల్కహాల్ అనేది వెంటనే రక్తంలో కలిసిపోతుంది. ఇక దీంతో వెంటనే అది మెదడుకు కూడా సంకేతాలను పంపిస్తుంది. ఆ తరువాత ఏవైతే మన శరీరాబయో వాళ్ళు ఉంటాయో వాటి మధ్య సమన్వయం తగ్గుతుంది. ఇక వెంటనే అన్ని విషయాలు తనకు తెలిసినట్లుగా భావిస్తారు. అయితే ఈ ఆల్కహాల్ మనం తీసుకోవడం వల్ల ఎక్కువగా ప్రభావం చూపేది మాత్రం మన శరీరంలోని లివర్ పైనే. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ప్రాబ్లెమ్ అనేది వస్తుంది.
ఒక వారంలో మూడు నుంచి నాలుగు సార్లు అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే కచ్చితంగా కాలేయం దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. దీని ప్రభావం మనకి ఐదేళ్ల తర్వాత నుండి కనిపించడం ప్రారంభమవుతుంది. ఎవరైతే ఆల్కహాల్ తాగుతారో వారి కాలేయం అనేది ఆల్కహాల్ను ఎసిటాల్టిహైడ్గా మార్చుతుంది. కాబట్టి ఇది ఒక విషపూరితమైన సమ్మేళనం అని మనం చెప్పవచ్చు.
ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం కొంతమేర ఆల్కహాల్ తీసుకుంటే శరీరంలో ఎటువంటి ఈ ప్రభావం చూపదని అంతేకాకుండా చాలా సులభంగా జీర్ణమవుతుందని కూడా చెప్పుకొచ్చారు. అదే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం మీద ఒత్తిడి పడి కాలేయం దెబ్బతినేటువంటి అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అధిక మొత్తంలో పరిమితికి మించి మద్యం సేవిస్తే వారి లివర్ కచ్చితంగా డ్యామేజ్ అవుతుందని చెప్పకు వచ్చారు.
సాధారణంగా తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్న అది మన శరీరంలో ఫిల్టర్ చేయడానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందట. కాబట్టి మన శరీరంలోనే రెండో అతిపెద్ద అవయవమైన కాలేయం మనం తీసుకునేటువంటి ఆహారాన్ని అలాగే తాగేటువంటి పోషకాలను ప్రాసెస్ చేస్తుంటుంది. కాబట్టి మనకు అవసరమయ్యే పోషకాలు అన్నింటిని కూడా అవయవాలకు పంపిణీ చేస్తుంది.