Karthika Amavsaya 2024: త్వరలో కార్తిక అమావాస్య.. ఆరోజు ఈ ఒక్క పని చేస్తే మీకు పట్టిందల్లా బంగారమే?
ఎక్కువగా అమావాస్య రోజున గంగా స్నానం, శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల పుణ్య ఫలితం ఎక్కువగా లభిస్తుందని మన హిందూ మత విశ్వాసం. అలాగే ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని కనుక పూజిస్తే ఆర్థిక సమస్యల నుండి లాభాలు బాటపడతారని కొంతమంది భక్తుల విశ్వాసం. అంతేకాకుండా అమావాస్య రోజున పూర్వికులకు తర్పణం లేదా పిండ ప్రదాణం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని అలాగే పితృ దోషం తొలగిపోతుందని పూర్వీకులు నమ్మకం.
అయితే ఈ ఏడాది కార్తీకం మాసం అమావాస్య డిసెంబర్ ఒకటో తేదీన వస్తుంది. అమావాస్య తిధి అనేది నవంబర్ 30 వ తారీకు శనివారం ఉదయం 10 :29 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది. అయితే డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11:50 నిమిషాలకు ముగుస్తుందట. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవిని 108 నామాలను జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది చెప్తుంటారు. ఈ అమావాస్య రోజున ఎక్కువగా లక్ష్మీదేవిని చాలామంది పూజిస్తూ ఉంటారు. దీనికి చాలా రకాల కారణాలు కూడా ఉన్నాయి.
లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడంతో పాటు ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చాలా మంది భక్తుల విశ్వాసము. కాబట్టే కార్తీకమాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది ప్రత్యేకంగా పరిగణింపబడుతారు. మామూలు నెలలలో వచ్చేటువంటి అమావాస్యలు వేరు కార్తీకమాసంలో వచ్చేటువంటి అమావాస్య వేరు. కాబట్టి ఈ అమావాస్యలు లక్ష్మీదేవిని అలాగే శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.