IPL Auction 2024 ఐపీఎల్ వేలం సమయంలో కీలక మార్పులు...?
ఇక మొదటగా మధ్యాహ్నం 3 గంటలకు ఐపీఎల్ మెగా వేలం మొదలు పెడుతామని చెప్పగా తాజాగా ఈ సమయంలో కొన్ని మార్పులు చేశారు. అదేంటంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా మరియు టీమిండియా మధ్య ఆస్ట్రేలియా దేశంలోని పెర్తులో మొదటి టెస్ట్ జరుగుతున్న సందర్భంగా అటు ఐపీఎల్ వేలానికి ఇటు టెస్ట్ చూసేటువంటి అభిమానులను దృష్టిలో పెట్టుకొని కొన్ని అభిమానులు నిరాశ పడకుండా కొన్ని మార్పులు అనేవి చేశారు.
టెస్ట్ మ్యాచ్ అనేది ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు పూర్తి అవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక అరగంట అటు ఇటు ఆలస్యం అవుతుండడంతో క్రికెట్ అభిమానులు నిరాశ పడకుండా ఐపీఎల్ వేలం సమయాన్ని అయితే మార్చారు. మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు ఐపీఎల్ వేలం అనేది ప్రారంభించనున్నారట. ఇలా చేయడం వల్ల అటు టెస్ట్ కొంచెం ఆలస్యమైనా అభిమానులు టెస్ట్ ని అలాగే టెస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ ఐపీఎల్ మెగా వేలం అనేది లైవ్ లో చూడవచ్చు.
కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ యాజమాన్యాలు తెలిపారు. ఇక దీంతో క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి రెండు కూడా చూడవచ్చు అని వీళ్ళని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ వేలం సమయాన్ని మార్చినట్లు తాజాగా తెలిపారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు అని తెగ కామెంట్లు చేస్తున్నారు.