Movie Ticket Price: సినిమా వినోదానికి ఎందుకంత ఖర్చు?... టికెట్ల పెరుగుదలకు కారణం ఇదే?
ప్రస్తుతం ఒక సినిమా నిర్మించాలంటే కొన్ని కోట్లు ఖర్చు ఖర్చు అవుతుంది. కాబట్టి వాటిని రాబట్టుకోవడానికి చిత్ర బృందం అంతా కూడా కొన్ని విభిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి సినిమా బడ్జెట్ మొత్తాన్ని కూడా రాబట్టుకోవడానికి ప్రమోషన్లు, టికెట్ రేట్లు పెంచడం వంటివి చేస్తూ ఉంటారు. మరి టికెట్లు పెంచడానికి గల కారణం అలాగే సినిమా బడ్జెట్ ఎందుకు అంత ఎక్కువ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రొడక్షన్ ఖర్చులు అంటూ ప్రతి ఒక్కరికి కూడా చాలానే డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకి ప్రొడక్షన్ ఖర్చులు, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, సౌకర్యాలకు ఖర్చులు, ఫ్యాన్ ఇండియా మార్క్ చూపించడానికి అయ్యే ఖర్చు, అలాగే లిస్టెడ్ కంపెనీల జోరుకు అయ్యేటువంటి ఖర్చుకి చాలానే ఖర్చు అవుతుంది. ఇందులో ఉండేటువంటి నటీనటులకు, పనిచేసే సిబ్బందికి, పరికరాల అద్దె, సెట్ నిర్మాణంకు, దుస్తులు అలాగే ప్రత్యేక ఖర్చులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ కోసం భారీగానే ఖర్చు చేస్తారు.
ఇక మరోవైపు సినిమాను ప్రమోట్ చేయడానికి అలాగే డిస్టిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడానికి డబ్బులు ఖర్చు చేస్తారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేయడంతో అన్ని భాషలలో సినిమా రిలీజ్ చేయడానికి అదనంగా చాలా నే ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్లు సినిమా నేర్పించడానికి అయ్యేటువంటి కొన్ని కోట్ల బడ్జెట్ను మన సినిమా టికెట్లు పెంచి మరి బడ్జెట్ కు అనుగుణంగా రాబట్టుకుంటున్నారు.