US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!

US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!

US Study:  మన భారతదేశంలో ఎంతో మంది యువకులు  చదువు కోసం ఇతర దేశాలకు వెళుతూ ఉన్నారు. అయితే తాజాగా అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులలో భారతీయులె ఎక్కువమంది ఉన్నారని తాజా రిపోర్టు ఒకటి వెల్లడించింది. ఇక అమెరికాలో ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విద్యార్థులు ఇతర దేశాల నుండి వచ్చి మరీ చదువుకుంటున్నారు. అక్కడ మరి చదువుకి ఎటువంటి బాధ్యతలు వహిస్తున్నారో తెలియదు కానీ మన భారతదేశంలోని విద్యార్థులకు మంది అమెరికాలో చదువుకుంటున్నారు. 

 గత సంవత్సరం వరకు ఈ లిస్టులో మొదటి స్థానంలో చైనా ఉండగా ఆ తర్వాత స్థానంలో భారత్ ఉండేదని యూఎస్ ఓపెన్ డోర్స్ రిపోర్టు 2024  తెలిపింది. ఇక దాదాపుగా 15 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ఈ జాబితాలో చైనాను కిందకి నెట్టేసి మరి ఇండియా మొదటి స్థానంలో నిలిచింది.  అయితే ఈ ఏడాదికి ఏకంగా మూడు లక్షల 31 వేల  602 మంది ఇండియన్ స్టూడెంట్లు అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చదువుతున్నారని పేర్కొంది. 

Read Also Earn Money: డబ్బును ఆదా చేసే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయవద్దు?

 అయితే గత ఏడాది విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం రెండు లక్షల 68000 మాత్రమే ఉండగా  ఇప్పుడు ఏకంగా మూడు లక్షల 30000 వరకు ఉండడంతో చైనా ను కిందకి నెట్టు మరి భారతదేశం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.  ఇక భారతదేశం తర్వాత రెండవ స్థానంలో చైనా నిలువగా  మూడో స్థానంలో సౌత్ కొరియా, నాలుగవ స్థానంలో కెనడా,  ఐదవ స్థానంలో తైవాన్ వంటి దేశాలు ఉన్నాయని ఓపెన్ డోర్స్ నివేదిక తాజాగా ప్రకటించారు. 

Read Also Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..

అయితే ఇందులో ఎక్కువగా మాస్టర్స్ మరియు పిహెచ్డి చదివేందుకు అమెరికాలో అడుగు పెడుతున్న విద్యార్థుల్లో  వరుసగా రెండో ఏడాది కూడా ఇండియన్ స్టూడెంట్స్ మొదటి స్థానంలో ఉన్నారని ఈ రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుతం ఏదైతే అమెరికా ఉందో ఇందులో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్ లలో  1,96,000 మంది  మాస్టర్స్ మరియు పీహెచ్డీ కోర్సుల్లోనే ఉన్నారని కూడా వివరించింది. 

Read Also  Maruti Suzuki Sales: ఆహా!.. ఏంటి ఈ అమ్మకాలు? మారుతి సుజుకి గ్రేట్ సేల్స్ ?

1932

Read Also Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?

ఇక పోయిన సంవత్సరం కంటే ఈ సంఖ్య 19% ఎక్కువ అని తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు 36,000 మంది దాకా ఉన్నారని పేర్కొంది. ఇక ఇదే సమయంలో నాన్ డిగ్రీ కోర్సులు చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది  1450 దాక బాగా తగ్గిందని క్షిప్తంగా వివరించింది. కాబట్టి అమెరికా యూనివర్సిటీలోనూ మనోళ్లే హవా కొనసాగుతుందని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి చైనాను వెనక్కి చూసి మరి భారతదేశం మొదటి స్థానాన్ని సంపాదించడం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలిగించిన విషయమే. 

Read Also Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఇటు భారతదేశం నుండి అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య కాకుండా అమెరికా నుంచి కూడా భారతదేశానికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రపంచంలో నలుమూలలో కూడా భారతదేశం యువకులు మరియు నివాసితులు ఉంటారని అందరితోను బాగా కలిసి పోతారని మనవాళ్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?