Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!... ఇలాంటివి అసలు చేయకండి?
మన పురాణాల ప్రకారం కొన్ని విషయాలలో తప్పులు చేయడం కారణంగానే ఈ పేదరికం వస్తుందని కొంతమంది పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం ఎక్కువమంది ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేవడం , చెట్టు కింద మూత్రవిసర్జన చేయడం , అలాగే రాత్రిపూట తాగే నీటిని తెరిచి ఉంచితే కూడా పేదరికం అనేది వస్తుందట. అలాగే రాత్రిపూట బిచ్చగాళ్లకు కూడా ఏమి దానం చేయకూడదట. ఇక ఇంతే కాకుండా ఇంట్లో చెత్త ఎక్కువగా ఉన్నా కూడా పేదరికం అనేది అంతే ఉంటుందట. బంధువులతో తప్పుగా ప్రవర్తించిన లేదా అవమానించినా సరే పేదరికం అనేది ఇంట్లో అంతె నిలుస్తుందట.
వంటగది దగ్గర మూత్ర విసర్జన చేసిన సరే పేదరికం అనేది వస్తుందట. విరిగిపోయిన దువ్వెనలతో తల దువ్వుకున్న సరే పేదరికం అనేది ఉంటుందట. ఏవైనా విరిగిపోయిన వస్తువులను మళ్లీ మనము ఉపయోగించినట్లయితే పేదరికం అనేది వస్తుంది. చెడు ఆలోచనలతో ఏమైనా పని చేసినా, భక్తి లేకుండా అపవిత్రతతో గ్రంథాలు చదివిన పేదరికం అనేది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వస్తుందట. చేతులు కడుక్కోకుండా అన్నం తింటే కూడా పేదరికం వస్తుందని పండితులు చెప్తున్నారు.
చూశారు కదా పేదరికం అనేది ఎందుకు వస్తుంది అంటే దానికి చాలా కారణాలే ఉన్నాయి. మన దురదృష్టం ఒకవైపు ఉంటే మనం చేసేటువంటి పనుల వల్ల కూడా పేదరికం అనేది వస్తుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఇటువంటి చేయకుండా ఉంటే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంత సిరి సంపదలు కురిపిస్తుందని పండితులు చెప్పుకొస్తున్నారు. అలాగే మన పురాణాల ప్రకారం మంచి వ్యక్తులకు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు
.