Pushpa 2: పుష్ప -2 లో మెయిన్ విలన్ గురించే టాలీవుడ్ మొత్తం చర్చ ?
అయితే మొదటి భాగం మంచిగా సక్సెస్ అందుకోవడంతో రెండో భాగంపై క్రేజ్ అనేది ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ సుకుమార్ అన్ని విధాలుగా చాలా జాగ్రత్త తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే తాజాగా నిన్న సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తుంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా అనేది కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ దాదాపుగా మూడు సంవత్సరాలు రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసి వాయిదా వేసి చివరికి ట్రైలర్ ను విడుదల చేసి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ చేస్తామని ఖరారు చేశారు. ఇక ట్రైలర్ లోను పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో కొన్ని కొత్త క్యారెక్టర్లు యాడ్ అయినట్లు అందులో ఎవరు మెయిన్ విలన్ అనేది తెలియట్లేదు.
ఇక ఇప్పటికీ ఈ సినిమాలో జగపతిబాబు మరియు ప్రకాష్ రాజ్ అలాగే మొదటి భాగంలో ఉన్న శకావత్ నటిస్తున్నారు. అయితే వీళ్ళ ముగ్గురిలో ఇప్పటికీ ఎవరు మెయిన్ విలన్ అనేది ఇంకా తెలియలేదు. అయితే ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం జగపతి బాబు మెయిన్ విలన్ గా నటిస్తున్నట్లుగా అనుకుంటున్నారు. ఇప్పటికే సుకుమార్ కాంబినేషన్లో జగపతిబాబు చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్లు అందుకున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని కూడా జగపతిబాబు మెయిన్ విలన్ అనే సమాచారం.