Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
ఇక ఎర్రచందనం అనేది భారతదేశానికి చెందిన చాలా ఖరీదైన మరియు అరుదైన చెట్టు కాబట్టి వీటికి విపరీతమైన డిమాండ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎర్రచందనం చెట్టు అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాల్లోనే దొరుకుతుంది. ఇక ఈ చెట్లు అనేవి ఎక్కువగా సతత హరిత అడవులలో కనిపిస్తాయి. ఇక బాగా ఎరుపు రంగులో ఉండే ఈ చెట్లు చూడడానికి చాలా అందంగా అలాగే బలంగా కూడా ఉంటాయి. గట్టమైన అడవుల్లో మాత్రమే ఈ చెట్లు ఉండగా వాటిని కొంతమంది అక్రమంగా నరికేసి వేరేచోట అమ్ముకుంటున్నారు. ఈ అమ్మే సమయంలో ఎవరైనా పోలీసులకు దొరికితే వాళ్ల గతి అంతే ఇక. ఈ ఎర్రచందనం చెట్లు అనేవి నరకడం చట్టపరంగా విరుద్ధం.
ఇక ఈ ఎర్రచందనం ను ఎక్కువగా ఫర్నిచర్, విగ్రహాలు తయారీ, అలంకరణ వస్తువులు, ఫర్ఫ్యూమ్స్ ఆంటీ అనేక వస్తువులలో ఉపయోగిస్తారు. కాబట్టి ఈ ఎర్రచందనం చెక్కతో తయారు చేయబడిన ప్రతి వస్తువు కూడా చాలా విలువైనదిగా భావిస్తారు. ఎందుకంటే అవి చాలా సంవత్సరాలు పాటు రావడంతో పాటు చెట్టుకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఎర్రచందనం సగటు ధర కేజీ 50,000 నుండి లక్ష వరకు ఉంటుందట.
ఇక మంచి నాణ్యమైన ఎర్రచందనం ద్వారా కిలో ఏకంగా రెండు లక్షలు వరకు ఉంటుందట. కాబట్టి దీనికి దేశవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఇక భారత దేశం 1960 వరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఎర్రచందనం మరియు చందనం ఉత్పత్తి చేసే దేశంగా పేరుపొందింది. ఇక తర్వాత ప్రభుత్వ చర్యల కారణంగా భారతదేశంలో గంధపు చెక్క ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యధిక చందనం ను ఉత్పత్తి చేస్తుంది.