Sabarimala: శబరిమల వెళ్లే వారు అలెర్ట్...? వస్తువులపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం!
ఇక ప్రారంభమైన మొదటి తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఆరు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కాకపోతే గత ఏడాది ఇదే సమయంలో దాదాపుగా 28 కోట్లు ఆదాయం కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి 41 కోట్లకు ఆదాయం పెరగడం అనేది తలుచుకుంటేనే ఏ స్థాయిలో భక్తులు వస్తున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక తాజాగా శబరిమల లో అయ్యప్ప భక్తులు వసతి కోసం ప్రత్యేకంగా గదులు బుకింగ్ పై దేవస్థానం కీలక ప్రకటన చేసింది. నవంబర్ 16 తారీఖున ఆలయం తెరుచుకోగా ఈ తొమ్మిది రోజుల్లో చాలామంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. కాబట్టి ఇంతమంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెరుగైన వసతులు కల్పించాలని ఆలయ అధికారులు తెలిపారు.
ఇక ఈ శబరిమల గదిని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కోసం ట్రావెన్కోర్ అధికారిక వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోగలరని సూచించింది. అయ్యప్ప భక్తులు పూర్తి సమాచారం కోసం www.onlinetdb.com ని సందర్శించాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాకపోతే మొదటిసారి బుక్ చేసుకునేవారు సైన్ ఇన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. వండి పిరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్లైన్లో బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాబట్టి ఎవరైనా సరే ని బంధువులలో అయ్యప్ప స్వామి ని దర్శించుకోవడానికి వెళ్లే వారికి సమాచారం తెలియజేయండి.