Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం
ఇక ఈ షార్ట్ లిస్టులో 366 మంది భారతదేశ క్రికెటర్లు ఉండగా మరో 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఈ పేర్లను నమోదు చేసుకున్న ఆటగాళ్ల అందరిలో కూడా ఎక్కువ ధరగా పలికే క్రికెటర్ ఒకరు ఉన్నారని మాజీ క్రికెటర్ సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ కు భారీ డిమాండ్ ఏర్పడేటువంటి అవకాశం ఉందని సురేష్ రైనా అన్నారు. కచ్చితంగా 25 కోట్లకు మించి పంత్ పై బిడ్ లు వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువ ధర పొందిన విషయం మనం చూసాం. కానీ ఈసారి మనోళ్లే కచ్చితంగా ఆల్ టైం రికార్డ్ ద్వారా పలుకుతారని రైనా జోస్యం చెప్పుకొచ్చాడు. ఇక ఇంతటితో ఆగకుండా రిషబ్ పంత్ మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మెగా వేలంలో భారీ డిమాండ్ ఏర్పడేటువంటి అవకాశం ఉందని రైనా అన్నాడు.
కొంత అటు బ్యాటింగ్ తోను అలాగే వికెట్ కీపింగ్ తోను బాగా జట్టును గెలిపించడంలో ముఖ్య పాత్ర పూజిస్తాడని అన్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్సు అయ్యారు కూడా ఇదే స్వభావంతో శ్రమిస్తారని జట్టుకు మంచిగా నాయకత్వంతో పాటు జట్టును సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే ప్లేయర్లుగా వీళ్ళు కచ్చితంగా ఉంటారని తెలిపాడు. కచ్చితంగా ఈసారి ఈ ముగ్గురు ప్లేయర్లకు కొన్ని కోట్ల కుమ్మరిస్తారని రైనా అన్నాడు.
ఇక ఈసారి అత్యధికంగా పంజాబ్ కింగ్స్ జట్టు దగ్గర ఏకంగా 110 కోట్లు ఉన్నాయని అలాగే ఢిల్లీ వద్ద కూడా 73 కోట్ల వరకు ఉన్నాయని ఇంకా ఆర్ సి బి దగ్గర కూడా 83 కోట్లు వరకు ఉన్నాయని ఈ మూడు జట్ల దగ్గర ఎక్కువగా డబ్బు ఉండడంతో పంత్ ను తీసుకునేటువంటి అవకాశం ఉందని రైనా అన్నాడు. కాబట్టి అటు కెప్టెన్ గానైనా లేక ఇటు వికెట్ కీపర్ కోసమైనా సరే వీళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా భారీగా కొనేటువంటి అవకాశం ఉందని రైనా అన్నారు. కాబట్టి ఈనెల 24 మరియు 25వ తేదీల వరకు ఓపిక పడితే ఖచ్చితంగా ఎవరు ఎంత ధర పలుకుతారు అనేది తెలుసుకోవచ్చు.