Vastu tips of broom: వాస్తు ప్రకారం ఇంట్లో చీపురును ఈ మూలకు పెట్టకండి... పెడితే ఏమౌతుందంటే..
ఇక వాస్తు ప్రకారం చీపురు బయట వారు ఎవరూ చూడకుండా ఇంట్లోనే ఒకచోట పెట్టాలి. గా శాస్త్రం ప్రకారం చీపురు పెట్టడానికి ఇంట్లో ఏ దిశ సరేనా ప్రదేశం అనేది ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వాస్తు ప్రకారం చీపురు మంచం కింద అసలు ఉంచకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి ఇల్లు అతలాకుతలమవుతుందని అంటూ ఉంటారు. మంచం కింద చీపురు పెట్టడం వల్ల లక్ష్మీదేవిని అగౌరపరిచినట్లేనని తద్వారా ఎక్కువగా ఆర్థిక నష్టం అనేది కలుగుతుందట. అంతేకాకుండా వాస్తు ప్రకారం ఇంట్లో రెండు చీపుర్లు అసలు ఉండకూడదట. ప్రతి ఒక్కరికి సమస్యలు రాకుండా ఉండాలంటే చీపురు ఒకదానిపై ఒకటి అసలు పెట్టకూడదు.
ఇక వాస్తు ప్రకారం కచ్చితంగా చీపురు అనేది ఎల్లప్పుడూ కూడా వాయువ్య మూలలో ఉంచాలి. ఈశాన్యం లేదా ఆగ్నేయం మూలలో అసలు పెట్టకూడదట. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం, విరిగిన చీపిరి ఇంటిలో అసలు ఉంచకూడదు. కాబట్టి మరొక కొత్త చీపిరిని కొనడం చాలా మంచిది. ఇందులో మరీ ముఖ్యంగా శుక్రవారం రోజున పాత చీపిరి ఏదైతే ఉంటుందో అది బయట విసిరేసి కొత్తది తీసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చీపిరి కు సంబంధించినటువంటి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఆలోచిస్తే మీ ఇంట్లో డబ్బులు ఎప్పటికీ నిలకడగా ఉంటాయి. కాబట్టి వాస్తు ప్రకారం పెద్ద వాళ్ళు చెప్పినట్లు కొన్ని నమ్మక తప్పవు.