Bitcoin: అమాంతంగా పెరిగిపోయిన బిట్ కాయిన్ విలువ!... ట్రంప్ ఏ కారణం?
ఇక ఒక్క రోజులోనే బిట్కాయిన్ ధరలు నాలుగు శాతం కంటే ఎక్కువ పెరిగి ఏకంగా దాని ధర 67,000 డాలర్లకు చేరుకుంది. ఇక నవంబర్ మొదటి వారంలో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు బిట్కాయిన్ ధర 67000 నుండి 68 వేల డాలర్ల మధ్య ఉంది. అయితే ఆ తర్వాత ఈ బిట్కాయిన్ ధర లక్ష డాలర్లు దాటుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఇక నవంబర్ 5 నుండి బిట్కాయిన్ ధర అనేది 50% పైగా పెరిగింది. అయితే ఈ బిట్కాయిన్ లో ఇన్వెస్ట్ చేసిన వారందరూ కూడా 145 శాతానికి పైగా బాగానే సంపాదించారు.
ఇక ప్రస్తుతం కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్కాయిన్ ధర 7% కంటే ఎక్కువ పెరుగుదలతో 102,656.65 $ వద్దా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక ఈ ట్రేడింగ్ మనం కనుక చూసినట్లయితే ఈ రకంగా చూసిన కూడా దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని క్రిప్టో మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక త్వరలోనే బిట్కాయిన్ ద్వారా 1.25 లక్షల డాలర్లకు చేరుకోవచ్చని అందరూ కూడా భావిస్తున్నారు. క్రిప్టో ప్రపంచం సామర్థ్యాన్ని గ్రహించిన ట్రంప్, తాజాగా ఎన్నికల ప్రచారంలో తనను తాను క్రిప్టో ఫ్రెండ్లీగా ప్రకటించుకోవడంతో అమెరికాను క్రిప్టో కరెన్సీ కి రాజధానిగా మార్చుతాను అని ప్రకటించారు.