Meat: గొర్రె కంటే మేక మాంసం ఎందుకు ఇష్టపడుతారు.. అందులో ప్రత్యేకత ఏముందంటే..?
ఎవరైనా సరే నాన్ వెజ్ షాప్ కి వెళ్లి మటన్ అడిగితే అతను ఇచ్చేది గొర్రెనా లేక మేకనా అని తరచుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం కచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మటన్ లో ఉన్నటువంటి మేకకు మరియు గొర్రెకు చాలా తేడాలు ఉంటాయి. గొర్రెకు అలాగే మేకకు రెండింటికి కూడా చాలా తేడాలు ఉన్నాయి. వీటి యొక్క రుచి మరియు పోషణ వంటి ప్రతిదీ కూడా వేరుగా ఉంటది.
ప్రస్తుత రోజుల్లో చికెన్ తో పాటుగా మటన్ కూడా బాగానే కొంటున్నారు. చికెన్ కన్నా మటన్ ధర ఎక్కువైనప్పటికీ చాలామంది మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మటన్ కొనుగోలు చేసేటప్పుడు అది మేకనా లేదా గొర్రె అని చూడడం చాలా ముఖ్యం. ఇక్కడ మీరు గొర్రె అయితేనేమి మేక అయితే నేమి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు.
నిజం చెప్పాలంటే... మేక మరియు గొర్రెల మధ్య రుచి మరియు కొవ్వు అలాగే పోషకాలు చాలా వేరుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడి మరి కొనండి. మేక మరియు గొర్రె రెండిటిలలో మేకనే శరీరానికి చాలా మంచిది. కాబట్టి నెలకు ఒకసారి మీరు కొనుగోలు చేసిన అది మేక నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయండి . మేక మరియు గొర్రెలు రెండిట్లో ఏది బెటర్ అనే దానికి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మేక రుచిగా ఉన్నప్పటికీ చాలా పోషకమైనది. మేక మరియు గొర్రెల లో 100 గ్రాములకు 20 నుండి 25 గ్రాములు వరకు ప్రోటీన్ ఉంటుంది. అదే సమయంలో ఒక మేక యొక్క కేలరీ కంటెంట్ కేవలం 130. కానీ ఇది గొర్రెలలో 300 ఉంటుంది. ఇక మేకలు మూడు గ్రాముల వరకే కొవ్వు ఉంటుంది. అదే గొర్రెలో ఏకంగా 20 గ్రాముల వరకు కొవ్వు ఉంటుంది. కాబట్టి గొర్రెలతో పోలిస్తే మేకలు కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మేక అనేది శరీరానికి చాలా మంచిది.