World Meditation Day: యోగా దినోత్సవమే కాదు!.. త్వరలోనే ధ్యాన దినోత్సవం జరుపుకోబోతున్నాం.. అది ఎప్పుడంటే?
ఇక అసలు విషయానికి వస్తే యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు పదివేల కిందట భారత్ చేసిన ప్రతిపాదనను ఐరాస ఆమోదించి ఏటా యోగ దినోత్సవం నిర్వహిస్తుంది. అయితే ఇక తాజాగా ధ్యాన దినోత్సవం కూడా నిర్వహించేందుకు భారతదేశంలో పాటు వివిధ దేశాలు కూడా తీర్మానాలు ముందుకు తీసుకువచ్చాయి. ఇక దీనికి ఐక్యరాజ్యసమితి కూడా జనరల్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం అనేది తెలిపింది . ఇక దీంతో డిసెంబర్ 21వ తేదీన " ప్రపంచ ధ్యాన దినోత్సవం " గా నిర్ణయించారు.
ఇక ఈ విషయం అనేది ఐరాసాలోని భారత శాశ్వత ప్రతినిధి అయినటువంటి పర్వత నేని హరీష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించేందుకు భారత్ తో సహా ఇతర దేశాలన్నీ కూడా జరుపుకోనున్నాయి . అయితే ఈ డిసెంబర్ 21వ తారీకు మాత్రమే ఒక ప్రత్యేకత ఉండడంతో ఈ తేదీని నిర్ణయించారు. భారత సాంప్రదాయ ప్రకారం శీతకాల అనంతరం అంటే ఉత్తరాయణంలో అడుగుపెట్టి రోజు కావడంతో చాలా పవిత్రమైనదిగా భారతీయులు చూడడంతో ఈ తేదీని పెట్టారు.
ఇక 193 మంది సభ్యులు ఉన్న ఐరాస జనరల్ అసెంబ్లీ శుక్రవారం నాడు సమావేశమై దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, మెక్సికో, బంగ్లాదేశ్, పోర్చుగల్, బల్గేరియా వంటి దేశాలు కోస్పాన్సర్ గా నిలిచాయి. ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆమోదపడడానికి ఇవన్నీ కూడా బాగానే సపోర్ట్ చేశాయి.