అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
అంబేద్కర్ బహుభాషా కోవిదుడని, ఇంగ్లీష్, సంస్కృతం, పాళి, హిందీ, మరాఠా, బెంగాలీ, కొంకిని వంటి భాషలపై ఎంతో పట్టు ఉందని పేర్కొన్నారు. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. విద్యా, ఉపాధి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎస్సి, ఎస్టీ, బీసీ వర్గాలకు రిఙర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి పాటు బడ్డారని గుర్తు చేశారు. రాజ్యాంగ రూప కల్పనలో ప్రముఖ పాత్ర పోషించి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య, లౌకిక వాద రాజ్యాంగాన్ని ప్రజలకు అందించారని తెలిపారు. కార్యక్రమంలో షాలోమ్ చర్చి పాస్టర్ జీజే కాంత రావు, డాక్టర్ డానియల్, దారా అనిల్ కుమార్, వై ఆనంద్ రావు, నవీన్, మదన్ లాల్, చిడిపి పుష్ప రాజ్, గుండు ఉపేందర్, వి భూషణం, హొలీ క్రాస్ ఫౌండేషన్ ఫౌండర్ మాడుగుల ఉదయ కుమార్, పలువురు అంబేద్కరిస్టులు, బహుజన వాదులు, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.