మిల్లుల్లో అమ్మిన సన్నధాన్యంకు బోనస్ ఇవ్వాలి
రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
రైతుల తెచ్చిన సన్న ధాన్యంను పరిశీలించి వారికి మిల్లుల వారిచ్చిన ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేమ శాతం కారణంగా సన్న ధాన్యంను రైతులు రైస్ మిల్లులోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నందున దీని గురించి జిల్లా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి సమగ్రంగా వివరించాలన్నారు.
గత వానకాలం సీజన్లో క్వింటాలుకు 2600 నుంచి 2700 వరకు సన్నధాన్యంకు ధర లభించాయని ఈ సారి 2200 రూ. కే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రైతుబంధు, రైతు భరోసా, ప్రభుత్వం ఇవ్వలేదని బోనస్ కూడా వర్తింపచేయక పోతే రైతులు అన్యాయమైపోతారని అన్నారు. పెట్టుబడి వ్యయం మూడింతలు పెరిగిందని రైతులకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఇస్తే రైతులకు కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. ఐకెపి మార్కెట్ లో అమ్మిన ధాన్యంకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడం ప్రభుత్వం బోనస్ ఎగవేతకు చేసిన కుట్రని ఆరోపించారు. ఎంతో శ్రమపడి పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించేలా బోనస్ వర్తింపజేయాలని కోరారు.