పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం
వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు
పాల్గొన్న పలు పాఠశాలల విద్యార్థులు
వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు
ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను ప్రారంభించి సందర్శించారు. అలాగే, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యవసాయం పై మక్కువ పెంచుకోవాలని, చిన్నతనం నుంచి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేసిన పీజీ, పీహెచ్ డీ విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులకు వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి గెలిచిన వారికి ప్రోత్సాహక పత్రాలు అందజేశారు. వేడుకల్లో అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి, కళాశాల ఓఎస్ఏ డాక్టర్ ప్రశాంత్ వివిధ శాఖల అధిపతులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు దాదాపు 27 పాఠశాలల నుంచి 2074 మంది విద్యార్థులు వివిధ స్టాళ్లను సందర్శించి, వ్యవసాయ కళాశాల క్షేత్రాలు సందర్శించి వివిధ అంశాలు తెలుసుకున్నారు.