మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

నల్లగొండ ,క్విక్ టుడే న్యూస్: నేడు జాతిపిత మహాత్మాగాంధీ  వర్ధంతి సందర్భంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ గుడి ఆలయంలో  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మహాత్మా గాంధీ సంస్మరణ సభకి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి  మాట్లాడుతూ " మహాత్మా గాంధీ  జీవితం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందడంతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని అయన సంకల్పించారని వివరించారు .

గాంధీజీ  సూచించిన మార్గం సత్యం , అహింస , మార్గంలో నడవాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. పెద్ద కాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ ఆలయానికి ప్రతి ఏటా వచ్చి ఆయన్ని సందర్శించుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమ వెంకటేశ్వర్లు , పొలగొని స్వామి , యాదగిరి , పల్లపు బుద్ధుడు , సైదులు , శ్రీను , గాంధీ గుడి ట్రస్ట్ చైర్మన్ భూపాల్ రెడ్డి , కమిటీ సభ్యులు , విద్యార్థులు, తదితరులు కూడా పాల్గొన్నారు.

Read Also పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?