తొర్రూరు, ఏప్రిల్ :- పోషకాహారం తీసుకోవడం వల్లే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని వెలికట్ట పల్లె దవాఖాన వైద్యురాలు ఫాతిమా ఫరా తెలిపారు. మండలంలోని వెలికట్ట గ్రామ ఒకటి, రెండు అంగన్వాడీ కేంద్రాల్లో పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా గర్భిణీలు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యురాలు ఫాతిమా ఫరా మాట్లాడుతూ....తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థాలను గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఆహారంగా అందివ్వాలని సూచించారు. పోషక విలువలు గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బి. రాజ్యలక్ష్మి ఎం. రాజ్యలక్ష్మి , ఏఎన్ఎం జ్యోతి, సిబ్బంది పద్మ, జ్యోతి, ఆశా కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
