మిర్యాలగూడ, ఏప్రిల్ 11 :-జ్యోతిరావు పూలే 198వ జయంతి మిర్యాలగూడలో తిరుమలగిరి అంజి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఆనాడు శూద్రుల, అతి శూద్రుల విముక్తి కి విధ్యా ఆయుధమని జ్యోతిబా గుర్తించరు అని అన్నారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, అమాయకత్వ పేదరికల నిర్మూలన సమానత్వ సాధనకు, విద్య వ్యాప్తి ద్వారా కృషి చేసినారని అన్నారు. తన భార్య అయినా సావిత్రిబాయి పూలే కు ఉన్నంత చదువులు చెప్పి చదువుల తల్లిగా మార్చారు. సావిత్రిబాయి భారత దేశంలో 17 ఏళ్ల వయసులో ఉపాధ్యాయురాలు అయినా తొలి స్త్రీ అన్నారు. సావిత్రిబాయి పూలే ప్రధానోపాధ్యాయురాలుగా బాలికలకు, స్త్రీలకు పాఠశాల ప్రారంభించిన తొలి భారతీయుడు జ్యోతిభా విజయాల వెనుక సావిత్రిబాయి అవిరాల కృషి ఉందన్నారు. ఆనాడే విద్యా హక్కు చట్టం, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజనము తమ నూతన పథకాలుగా నేటి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయని అన్నారు. 170 ఏళ్ల క్రితమే పూలే దంపతులు విద్యా హక్కు గురించి ప్రచారం చేసి అమలుకు ప్రభుత్వాల పై ఒత్తిడి తెచ్చినారని అన్నారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు వస్కుల మట్టయ్య, నల్లగంతుల నాగభూషణం, మురళి యాదవ్, ధనుంజయ నాయుడు, మచ్చ ఏడుకొండలు, సండ్ర నాగరాజు, మారం శ్రీను, జయరాజు, మడుపు శ్రీను, కొండల్, రవీందర్ నాయక్, దినేష్,వస్కుల భరత్, పోతుగంటి కాశి తదితరులు పాల్గొన్నారు.
