సర్వీస్ రోడ్డు లేక అనేక రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు

సర్వీస్ రోడ్డు లేక అనేక రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు

వేములపల్లి, ఏప్రిల్ 17 (క్విక్ టుడే న్యూస్):- మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసే వరకు మా పోరాటం ఆగదని సిపిఐ మండల పార్టీ కార్యదర్శి జిల్లా యాదగిరి అన్నారు. గురువారం అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ, దామరచర్ల మండల సిపిఐ పార్టీ కార్యదర్శిలతో కలిసి మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఈ రహదారి పై అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డప్పటికీ సర్వీస్ రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. గత రెండు నెలల్లోనే మండల కేంద్రానికి చెందిన సుమారు ఆరుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారి వెంట సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసే వరకు సిపిఐ పార్టీ మరింత బలంగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ, దామరచర్ల సిపిఐ పార్టీ కార్యదర్శులు ఎం.డి.సయ్యద్, లింగా నాయక్, రైతు సంఘం కార్యదర్శి మద్దిరాల వెంకటరెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కౌన్సిల్ మెంబర్ వల్లంపట్ల వెంకన్న, సీనియర్ నాయకులు రంగారెడ్డి, కొర్ర శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకులు పుట్టల కృష్ణయ్య, సిపిఐ నాయకులు పెదపంగా ఆనందం, మాతంగి సత్యం, బస్కా పరమేష్, జడ భీమయ్య, సంపతి మహేష్, వలంపట్ల సుధాకర్, నెహ్రూ నాయక్ గుడుగుంట్ల విజయ్, మురళి, కుమ్మరి రాములు తదితరులు పాల్గొన్నారు .

IMG-20250417-WA0030

Read Also ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?