Miryalaguda : దుర్మార్గ మోడీ పాలనను పారదోరాలి
పట్టణ మహాసభలో జూలకంటి
ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ పాలనకు ప్రజలు రాజకీయకంగా చేతన్య వంతులై బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మార్కండేయ ఫంక్షన్ హాల్లో వేముల రామిరెడ్డి నగర్, ఎం.డి మహమూద్ ప్రాంగణంలో పట్టణ 13వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజా సంపదను కార్పొరేట్ వారికి అప్ప చెపుతూ మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్, ఆదాని అంబానీ, సర్కారు నడుస్తున్నదన్నారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై అప్పులుగా ఉంచారని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని గుర్తు చేశారు. ప్రపంచ ప్రజలందరూ కమ్యూనిస్టు పాలనకు మద్దతు తెలుపుతున్నారని అందులో భాగంగా ఇటీవల కొన్ని దేశంలో జరిగిన ఎన్నికల్లో రుజువు అయిందన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అణిచివేసే దమ్ము, ధైర్యం కేవలం కమ్యూనిస్టు పార్టీకే ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలిచ్చి అధికారo లోకి వచ్చిందని ఇప్పుడు ఆ హామీలను విస్మరిస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 11 మాసాలు అవుతున్న హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు అవుతున్న సంక్షేమ పథకాలలో లోపాలను అరికట్టాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. మూసి ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ తప్పులను తప్పిపుచ్చుకునేందుకు రాజకీయ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు కార్యకర్తలగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కార కోసం ఉద్యమాలు చేయాలని కోరారు. గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతo కు పాటుపడాలన్నారు. లోపాలను అధిగమించి పార్టీ నిర్మాణాన్ని ప్రతిష్ట చేయాలన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలన్నారు. సీనియర్ నాయకులు భవాండ్ల పాండు, అరుణ అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు విరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, బంనకంటిద్రోణచారి, ఆయూబ్, ఎండి అంజాద్ తిరుపతి రామ్మూర్తి, పరుశురాములు, వరలక్ష్మి, సీతారాములు, సీనియర్ నాయకులు గాదె పద్మ తదితరులు పాల్గొన్నారు.