Private Hospitals Cheating: ప్రైవేట్ ఆస్పత్రులు చీటింగ్... జర జాగ్రత్త సుమా..!

Private Hospitals Cheating: ప్రైవేట్ ఆస్పత్రులు చీటింగ్... జర జాగ్రత్త సుమా..!

Private Hospitals Cheating: ప్రస్తుత రోజుల్లో చాలామంది కూడా ప్రైవేట్ హాస్పిటల్ లో చీటింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ఏదో ఒక జబ్బు కారణంగా హాస్పిటల్స్ కి వెళ్తూ ఉన్నారు. అయితే ఇదే అనువుగా తీసుకొని కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.  కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ దెబ్బకి ప్రజలందరూ కూడా చాలా మంది షాకు కి గురవుతున్నారు. ఏదైనా జబ్బు చేస్తే భయం ఎక్కడ హాస్పిటల్స్ లో ఎక్కువ డబ్బులు లాగుతారని. దానికి కారణంగా చాలామంది నిరుపేదలు కూడా ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడుతున్నారు. 

 మరోవైపు ప్రభుత్వాసుపత్రులు ఉన్నా కానీ వాటిలో సరైన వైద్యం అందించక చాలా మంది చనిపోతున్నారని నెపంతో అందరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి మొగ్గు చెబుతున్నారు. ఇప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద నమ్మకం అనేది ప్రజలకి రావటం లేదు. ఇటువైపు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే మంచి సదుపాయాలు లేక   ఎక్కడ చనిపోతారని భయం. మరోవైపు ఎక్కువ డబ్బులు కట్టలేక ప్రవేట్ హాస్పిటల్స్ లో చేర్పించలేక నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా  డబ్బే ప్రధానంగా ఆలోచిస్తున్నారు. 

Read Also 110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు 

 ప్రస్తుత రోజుల్లో డబ్బులు లేనిది ఏది కూడా సాగదు. ఇక డబ్బునే లక్ష్యంగా పెట్టుకొని చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులు కూడా నడిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని గుర్తింపు లేని ప్రైవేట్ ఆస్పత్రులు ఇప్పటికి కూడా చాలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. సరైన సదుపాయాలు లేక అలాగే సరైన వైద్యులు లేక  చాలా సందర్భాల్లో చాలా మంది ప్రజలు చనిపోయిన విషయం మనందరికీ తెలిసినటువంటి విషయాలే. 

Read Also HYDRA Commissioner : నివాసం ఉంటున్న ఇండ్ల‌ను కూల్చివేయం

23 -02
 ప్రతి ఒక్క మనిషి కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం తెలుసుకోవాల్సిందే. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా సరే ఏదైనా ఒక వ్యాధి చేస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ కి వెళుతూ ఉంటారు. కానీ అక్కడ సరైన వైద్యులు లేదా సరేనా సదుపాయాలు ఉన్నాయో లేదో అనేది ఎవరు కూడా తెలుసుకోకుండా హాస్పిటల్లో అడ్మిన్ అవుతారు. కానీ అలా చేయడం అనేది ముమ్మాటికి మీదే తప్పు అవుతుంది. అలా చేయడం కారణంగా మీ అంతట మీరే కొన్ని వేరే ఇతర జబ్బులను తెచ్చుకోవాల్సి వస్తుంది. 

Read Also Women Protection: పనిచేస్తున్న ప్రాంతాలలో మ‌హిళల‌కు భద్రత ఉందా..?  మంత్రి సీతక్క ఏమ‌న్నారంటే..

ఎందుకంటే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు వాళ్ళు ఇష్టానుసారంగా ఆపరేషన్ లోనేవి చేస్తూ ఆసుపత్రిని  నడుపుతున్నారు. ఏ రోగాన్ని నయం చేసేటటువంటి డాక్టర్ హాస్పిటల్ లో ఉన్నాడు లేదో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అలాగే చాలామంది కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఏమీ తెలియకుండా ఊరకే హాస్పిటల్ డబ్బులు ఇచ్చి మరీ పెట్టుకుంటారు. అలాంటి వాళ్ల నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మీరు కొన్ని ప్రమాణాలను పట్టించుకోకుండా హాస్పిటల్ కి వెళ్లి ఏమీ తెలియని వారిచేత ట్రీట్మెంట్ తీసుకుంటే మీరే మరొక కొత్త వ్యాధికి కారకులు అవుతారు. 

Read Also Narayan Meghaji Lokhande: ఆదివారం  రోజే ఎందుకు సెలవు?.. మన దేశంలో ఎప్ప‌టి నుంచి అమ‌లులోకి వ‌చ్చింది..

 ఈ మధ్యనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా  ఇష్టానుసారంగా ఆసుపత్రిలో నడిపిస్తూ  ఆపరేషన్లకు ఎక్కువ డబ్బులు గుంజుతున్నాయని అలాగే చాలామంది హాస్పిటల్స్ లో సరేనా వైద్యానికి సరైన డాక్టర్ లేరని వైద్యశాఖ ఏడాదిలో కొత్తగా ఏడు టాస్క్ఫోర్సులను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా  జల్లెడ పట్టించారు. ఇందులో ఏకంగా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి  విషయాలన్నీ బయటపడ్డాయి. 

Read Also Miryalaguda : దుర్మార్గ మోడీ పాలనను పారదోరాలి

23 -03
 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 97 ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేశారు. అలాగే మరో 1048 ఆసుపత్రులకు షోకాజు నోటీసులు పంపించారు. వీటితోపాటుగా 327 హాస్పిటల్స్  కు 39 లక్షల 50 వేలు వరకు జరిమానా కూడా విధించారు. హైదరాబాదులో చక్కగా ఆసుపత్రిలో నడపకుండా సరైన పత్రాలు లేకుండా హాస్పిటల్స్ నడుపుతున్న 242 హాస్పిటల్స్  కు వైద్యశాఖ నోటీసులు జారీ చేసింది. 

అలాగే అదిలాబాద్ జిల్లాలో 45 మరియు సంగారెడ్డి జిల్లాలో  19 సరిగా నడప నందుకు అలాగే అనుమతులు లేని కారణంగా మూత వేశారు. ఇలా చాలా జిల్లాల్లో ఇష్టానుసారంగా ఆసుపత్రులను నడుపుతున్నటువంటి  డాక్టర్స్ ని కూడా చాలామందిని వైద్యులను కూడా వైద్యశాఖ అధికారులు తొలగించారు.  ప్రస్తుతం మిగతా అన్ని ఆసుపత్రులకు వైద్య శాఖ భారీగా హెచ్చరికలు జారీ చేసింది.  

ప్రతి ఒక్కరు కూడా  తమ నిధి నిర్వహణ  సక్రమంగా చేయాలని అలాగే వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు ఎటువంటి హానికరం చేయకుండా   డబ్బు మీద ఒత్తిడి పెంచకుండా వైద్యాన్ని అందించాలని కోరారు. ఎవరైనా సరే అక్రమలకు పాల్పడితే కచ్చితంగా సీజ్ చేసి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రిని సక్రమంగా నడిపేందుకు అలాగే మంచి వైద్యాన్ని అందించేందుకు   ప్రయత్నం చేస్తున్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

Pharmacy Shop: ఈ బిజినెస్ లో  లాభాలు ఎక్కువ‌.. న‌ష్టాలు త‌క్కువ ?  ఎలాగో ఒక‌సారి తెలుసుకోండి Pharmacy Shop: ఈ బిజినెస్ లో  లాభాలు ఎక్కువ‌.. న‌ష్టాలు త‌క్కువ ?  ఎలాగో ఒక‌సారి తెలుసుకోండి
Pharmacy Shop:  చాలామంది ప్రస్తుత రోజుల్లో మంచి బిజినెస్ పెట్టాలని చూస్తున్నారు. ఈనాటి కాలంలో చదువుకున్న దానికి ఎక్కడా కూడా ఉద్యోగాలు రాకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా...
India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీ? అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్?
Constipation: మలబద్ధకం సమస్య వెంటాడుతుందా?.. ఈ చిట్కాలు పాటించండి?
Android Phone: మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ఫీచర్స్ మీకు తెలుసా?... ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే?
Darsh Amavasya: మీకు  ఎక్కువ కష్టాలు ఉన్నాయా?.. ఈ దర్శ అమావాస్య రోజు ఇలా చేయండి?
Elon Musk: ఇండియా మొత్తం వైఫై... అదిరిపోయే న్యూస్ చెప్పిన ఎలా ఎలాన్ మస్క్?
Earn Money: డబ్బును ఆదా చేసే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయవద్దు?