Goa Tour Package : తక్కువ బడ్జెట్‌తో మస్త్ ఎంజాయ్.. 4 రోజుల గోవా టూర్ ఫ్లైట్ జర్నీ..
కానీ.. చాలామందికి గోవా ఎలా వెళ్లాలి? ఎక్కడ స్టే చేయాలి? ఏ ప్రాంతాలు విజిట్ చేయాలి? అనే విషయాలు తెలియదు. అటువంటి వాళ్ల కోసమే.. హైదరాబాద్ టు గోవా టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఈ టూర్ ప్యాకేజీ వివరాలు ఒకసారి చూద్దాం రండి.
Goa Tour Package : రూ.20 వేల లోపే టూర్ ప్యాకేజీ ధర
ఈ టూర్ ప్యాకేజీకి లక్షలకు లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. రూ.20 వేల లోపే ఈ టూర్ పూర్తవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా 4 రోజులు గోవాలో ఎంజాయ్ చేయొచ్చు. ఫ్లైట్ లో ప్రయాణం ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ టూరిజం వాళ్లు ప్రత్యేకంగా ఫ్లైట్ లో తీసుకెళ్లి గోవా అందాలను చూపించనున్నారు. హైదరాబాద్ లో ఉదయమే విమానం ఎక్కి గోవాకి చేరుకున్న తర్వాత అక్కడ హోటల్ లో బస ఉంటుంది.
కాసేపు హోటల్ లో రెస్ట్ తీసుకున్న తర్వాత జువారీ రివర్ ను ఆ రోజు చూడొచ్చు. ఆ తర్వాత రెండో రోజు మొత్తం సౌత్ గోవా టూర్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, పోర్ట్ రైట్ గ్యాలరీ, మిరామర్ బీచ్, మండోవి రివర్, బోట్ క్రూజ్, ఆర్కియాలాజికల్ మ్యూజియం, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, బసిలికా ఆఫ్ బామ్ జీసస్.. ఇలా సౌత్ గోవాను మొత్తం ఒకేరోజు పర్యటించవచ్చు.
ఆ తర్వాత మూడో రోజు మాత్రం నార్త్ గోవా టూర్ ఉంటుంది. నార్త్ గోవాలో ఉన్న అంజునా బీచ్, చపోరా ఫోర్ట్, వాగేటర్ బీచ్, కండోలిమ్ బీచ్, బాగా బీచ్, అగ్వాడా ఫోర్ట్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలలో కూడా పాల్గొని ఎంజాయ్ చేయొచ్చు.
రెండు, మూడు రోజులు పూర్తిగా నార్త్, సౌత్ గోవాలు రెండూ తిరిగి ఆ తర్వాత నాలుగో రోజు మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుంటే మధ్యాహ్నం గోవా నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఉంటుంది.
ఈ టూర్ లో భాగంగా రూ.18,935 పే చేస్తే చాలు. ట్రిపుల్ ఆక్యపెన్సీలో ప్యాకేజీ ఉంటుంది. ఒకవేళ ట్రిపుల్ వద్దు డబుల్ కావాలని అనుకుంటే రూ.19,245 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీ అయితే మాత్రం రూ.25 వేలు చెల్లించాలి.
ఈ ప్యాకేజీలో భాగంగా.. విమాన టికెట్లతో పాటు హోటల్ లో బస(ఏసీ హోటల్), టిఫిన్, లంచ్, డిన్నర్, ప్లేస్ ల సందర్శన, టూర్ గైడ్, ట్రావెల్ ఇన్సురెన్స్ అన్నీ కవర్ అవుతాయి.