Alluri Sitarama Raju : అల్లూరి సీతారామరాజు తొలి పోరు జరిగి 102 ఏళ్ళు.. ఎలా జరిగిందో తెలుసా?
అలాంటి సీతారామరాజు తన తొలి యుద్ధం చేసి ఇవాల్టికి 102 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ పాలకుల నుండి ఆదివాసీలను విడిపించుకోవడానికి ఈ అల్లూరి సీతారామరాజు ఒక పోరాట యోధుడిలా పోరాడి స్వాతంత్ర పోరాటంలో ఎంతగానో పేరు సంపాదించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సాయుధ యుద్ధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను ఎర్పరచుకోవడానికి చింతపల్లి పోలీస్ స్టేషన్ పై 1922 ఆగస్టు 22వ తారీఖున తన సైన్యంతో అల్లూరి దాడి చేయించాడు.
అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రలో ఇదొక మరిచిపోలేనటువంటి ఘటన కారణంగా ఈ విషయాలను మీకోసం తెలియజేస్తున్నాం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లోని మొగల్లు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు 15 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలకుల వ్యవహారాలపై కోపంగా ఉండేవాడు. ఎలా అయినా సరే ఈ బ్రిటిష్ పాలకులను మన విముక్తి పొందాలని అనుకునేవాడు.
ఇటువంటి ఈ క్రమంలోనే లంబసింగి ఘాట్ రోడ్ నిర్మాణానికి ఆదివాసీలను ఉపయోగించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుసుకొని అప్పట్లో ఉన్నటువంటి తహసిల్దార్ బాష్టియన్ పై బ్రిటిష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ బ్రిటిష్ ఉన్నతాధికారులు తిరిగి అల్లూరి సీతారామరాజు పైనే ఎదురుదాడికి తిరిగి కేసు పెట్టించారు. ఈ అల్లూరి సీతారామరాజు ఈ అడవుల్లో ఉంటే ఆదివాసీల్లో తిరుగుబాటు తీసుకురాగలడని బ్రిటిష్ ఉన్నతాధికారులు అతన్ని నర్సీపట్నం తీసుకెళ్లి గృహనిర్బంధం చేశారు.
అప్పటి బ్రిటిష్ పాలకులు అతనికి ఒక 50 ఎకరాలు మరియు పశువులను కొని సీతారామరాజును చూసుకోమని అప్పగించారు.1922వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఫజల్ ఖాన్ సహాయం ద్వారా తను శిక్షణ తప్పించుకొని మళ్లీ అడుగులకు వచ్చి ఆదివాసీలతో సాయుధ పోరాటానికి సిద్ధమయ్యాడు. ఆదివాసీల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో గుమిగుడి వాళ్లని చైతన్యవంతులను చేసి ఈ యొక్క సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలను ఎలాగైనా సాధించుకోవాలని 1922 ఆగస్టు 19 వ తారీఖున తన తెలివితో ఆలోచనతో చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేయాలని ఒక వ్యూహాన్ని రచించాడు.
అల్లూరి సీతారామరాజు దాడి చేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్ ఇప్పటికి అలానే చెక్కుచెదరకుండా ఉంది. ఏ మాత్రం దాడి చేసిన సమయంలో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంటుంది. ఇప్పటికీ ఆ పోలీస్ స్టేషన్ లోని సగభాగాన్ని పోలీసులు మరో సగభాగాన్ని ఉప ఖజానా కోసం వాడుతున్నారు. అయితే అప్పట్లో ధ్వంసమైన చింతపల్లి పోలీస్ స్టేషన్ను ఆనాటి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, కిషన్ రెడ్డి ఆధునికరిస్తామని అన్నారు.
అలాగే భీమవరంలో 125 జయంతి సందర్భంగా ఉత్సవాలు జరిగిన సందర్భంలో హాజరైన ప్రధానమంత్రి కూడా చింతపల్లి పోలీస్ స్టేషన్ ను మళ్లీ తిరిగి రూపొందించి ప్రారంభిస్తామని ప్రజలనుదేశించి చెప్పారు. తిరిగి కొత్తగా రూపొందించడానికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని తెలిపారు. కానీ ఇప్పటికి అది అలానే ఉందని భీమవరం ప్రజలు అంటున్నారు. ఇంతటి ధైర్య సాహసాలను కలిగివున్న అల్లూరి సీతారామరాజుకి వారి విగ్రహాలు తయారు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్వాతంత్ర పోరాటంలో అమరుడైన అల్లూరి సీతారామరాజు గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనిఅందరూ అంటున్నారు.