Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డు.. మొట్టమొదటి నాయకుడిగా గుర్తింపు ఎందుకంటే..
అలాగే సినిమాలు చేస్తూ తన సొంత కాళ్ళ మీద నిలబడి ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకొని ఇవాళ ఈ స్థాయిలో ఎదిగాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. సినిమా స్టార్టింగ్ లో అతను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల మీద మమకారంతో ఎలా అయినా సేవ చేయాలని తపనతో ఇవాళ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలందరికీ సేవ చేస్తున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత ఎన్నో రకాలుగా పలు అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఎన్నో ఘనతలు సాధిస్తూ అందరి దృష్టిలో మంచి వ్యక్తిగా తనకంటూ ప్రత్యేకమైన మంచితనం గుర్తింపు పొందుతున్నాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రజలకు ఎన్నో సేవలను చేస్తూ ముందుకు వస్తున్నాడు. తన ఆరోగ్యం బాగా లేకపోయినా సరే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలను దగ్గరుండి పరిశీలిస్తున్న కథనాలు మీడియా నుండి మనకి ఎన్నోసార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ దాదాపు ఇప్పటికీ ఎన్నో అవమానాలు ఎదుర్కొని ప్రస్తుతం రాజకీయాల్లో జీవనం సాగిస్తూ ఉన్నాడు.
సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ఎన్నో సేవలు చేస్తూనే ఉంటారు. కానీ ఎవరికి ఎలాంటి గుర్తింపు అనేది ప్రత్యేకంగా ఉండదు. ప్రజలకు సేవ చేస్తే తనని దాదాపుగా అతను బతుకుండే వరకు ఇతను మంచి చేశాడు ఇతను మంచి చేయలేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఇవ్వరు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో ఏ వ్యక్తికి గిన్నిస్ బుక్ రికార్డు అనేది లేదు. ఆ ఘనతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుకున్నాడు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా వచ్చి దాదాపు నాలుగైదు నెలలే కావస్తున్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపుగా సేవలను చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ను సాధించి చరిత్ర సృష్టించాడు. బహుశా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా మన దేశంలో ఇప్పటివరకు ఎటువంటి రాజకీయ నాయకుడు ఇలాంటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది సాధించలేదు. కాబట్టి మన తెలుగు రాష్ట్ర వ్యక్తి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘనత సాధించడం వల్ల మన తెలుగు రాష్ట్రాలు తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే జనసేన నాయకులు అభిమానులు అలాగే కూటమి నాయకులు అభిమానులు ఎంతో ఘనంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మరియు అటవీశాఖ లను సంబంధించి దానికి తగ్గట్టు సేవలను చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒకేసారి 13,326 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి కొంత మొత్తంలో సహాయ నిధి కింద డబ్బులు అనేవి పంచారు. ఇటువంటి మహోన్నత సేవలను గుర్తించిన వరల్డ్ రికార్డ్ యూనియన్అనేది ప్రత్యేకంగా గుర్తించింది. దీనికి తగ్గట్టుగానే ఈ వరల్డ్ రికార్డు యూనియన్ అఫీషియల్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ వరల్డ్ రికార్డ్ పత్రాన్ని అలాగే మెడల్ని పవన్ కళ్యాణ్ నివాసం లోని హైదరాబాద్లో ఇవాళ ఉదయం అందజేశారు.
సామాన్యంగా ఇటువంటి వరల్డ్ రికార్డ్ అనేవి రాజకీయపరంగా ఎన్నడూ ఇలాంటివి చూడలేదు. అది కూడా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఈ గిన్నిస్ బుక్ రికార్డు అనేది దకడంతో చాలామంది పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులైతే మాత్రం ఏకంగా భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి సేవలు మరెన్నో అందిస్తాడని ప్రజలు అలాగే అభిమానులు కూడా భావిస్తూనే ఉన్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానించిన ప్రతిపక్ష నేతలను కూడా ఇవ్వాలా సాధారణంగా పలకరిస్తూ తమ మంచి మనసును చాటుకుంటున్నాడు పవన్ కళ్యాణ్.
2021 ఎలక్షన్స్ సమయంలో ఒక సీటు వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ కి 2024లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి 100% తో ఒక ప్రత్యేకమైనటువంటి ఎవరు సాధించలేనటువంటి చరిత్రను సృష్టించి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం తెలుగు ప్రజలే. అటువంటి ఎన్నో సేవలను అందిస్తాడని ముందే గుర్తించి ప్రజలందరూ అతనిని గెలిపించి డిప్యూటీ సీఎం గా పగ్గాలకు అందేలా చేశారు. మరి అంతటి సేవలను చేస్తాడని గుర్తించిన ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇవాళ గిన్నిస్ రికార్డు బుక్ యూనియన్ లో మెడల్ సాధించి తిరిగి ప్రజలకు నేను ఉన్నాను సేవలు చేయగలను అని చెప్పి తన ఉనికిని చాటుకున్నాడు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధికి కొన్ని నిధులు కావాలని కోరగానే చంద్రబాబు ₹2,500 కోట్లు గ్రామాలకు నిధులు కేటాయించడం వల్ల ఇవాళ ఈ రికార్డ్స్ అనేవి నేను సాధిస్తున్నానని రాష్ట్రంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉంటారు కానీ వారందరూ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే మాత్రం ఇలాంటి అడ్డంకులు ఏవి ఉండవని చెప్పి పవన్ కళ్యాణ్ మరోసారి తన వ్యక్తిగత మంచి మనసును చాటుకున్నాడు.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో మంది అభిమానులకు సినిమా పరంగా మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి సేవకుడు అని అందరూ అంటుంటారు. మరి ఇంతలా ఆయన సేవలు చేయబట్టే ఇవాళ అందరికీ పవన్ కళ్యాణ్ అంటే తెలుసు. అయితే ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన కార్యకర్తలు, వీర మహిళలు తమ అభిమాని నాయకుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఎంతోమంది కలలు కంటున్నారు. మరి ఇవన్నీ జరగాలంటే మనం వచ్చే ఎలక్షన్స్ దాకా వేచి చూడాల్సిందే.