Pydithalli Sirimanotsavam: సమీపిస్తున్న ఉత్తరాంధ్ర పైడితల్లి జాతర.. ఇక ఈ 40 రోజులు కనువిందే
ఈ జాతర మన ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద పండుగ జరుపుకుంటారు. ఈ పైడితల్లి సిరమాను జాతర అంటే మన తెలుగు ప్రజలకు ఒక సంబరం లాంటిది. జీవితంలో ఒక్కసారి అయినా ఇలాంటి జాతరను చూసి తనివి తీరాలని అనుకుంటారు పెద్దలు. ఇది నిజంగానే తెలంగాణలోని సమ్మక్క సారక్క జాతర లాంటిది. నిజంగా చాలా ప్రాముఖ్యత ఉన్న ఈ పైడితల్లి అమ్మవారి జాతరకు దేవాలయంలో అన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ జరిపే ఈ జాతరకు విజయనగరం తో పాటు విశాఖపట్నం,శ్రీకాకుళం,తెలంగాణ, ఒడిశా చతిస్గడ్ లాంటి రాష్ట్రాల నుండి ఎంతోమంది భక్తులు ఈ జాతరకు హాజరై పైడితల్లి అమ్మ వారి ఆశీస్సులను తీసుకుంటూ దర్శించుకుని భక్తి పరవశ్యంలో మునిగిపోతూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ అమ్మవారి జాతరను రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి వీక్షిస్తూ ఉంటారు.
ఈ విజయనగర పైడితల్లి సిరిమాను జాతర దాదాపుగా 40 రోజులు పాటు కొనసాగుతుంది. ఈ 40 రోజులు పాటు జరిగే ఈ జాతరకి ఎంతోమంది భక్తులు తరలివస్తుండడంతో ఎన్నో జాగ్రత్తలను అక్కడ పోలీస్ సిబ్బంది దేవాలయ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అనర్ధాలు, కష్టాలు కలగకుండా ఇప్పటికే ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నామని దానికి తగ్గట్టు అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ పైడితల్లి అమ్మవారి జాతర అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఆనందంతో తెలియని ఉద్వేగానికి గురవుతుంటారు. అటువంటి ప్రాముఖ్యత ఉన్న ఈ అమ్మవారి జాతరకు ఆలయ అధికారులు ముహూర్తం అనేది ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 20 తారీకున భాద్రపద బహుళ తదియ రోజున మండల దీక్షతో ప్రారంభమవుతున్న...ఈ పండగ అదే రోజున ఉదయం 11 గంటలకు అమ్మవారికి పండుగల రాటవేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. అక్టోబర్ 14న అమ్మవారికి తొల్లెల ఉత్సవం జరగనుండగా... ప్రాముఖ్యత ఘట్టమైన సిరిమాను ఉత్సవం అక్టోబర్ 15వ తారీఖున జరుగుతుందని తెలిపారు.
అక్టోబర్ 22వ తారీఖున మంగళవారం పెద్ద చెరువులో అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుందని కూడా తెలిపారు. వీటితోపాటుగా 27 సాయంత్రం కలశ జ్యోతుల ఊరేగింపు జరుగుతుందని కూడా ప్రకటించారు. అలాగే 29న మంగళవారం చదురు గుడి వద్ద ఉయ్యాల కంబాల మహోత్సవం జరుగుతున్నట్లు ప్రకటించారు. అలాగే 30 తారీకున బుధవారం వనం గుడి ఆవరణంలో చండీ హోమం మరియు పూర్ణాహుతి దీంతోపాటుగా దీక్ష విరమణ ఉదయం 8 గంటల నుండి సాగుతాయని తెలిపారు.
ఈ 40 రోజులు పాటు జరిగే ఈ అమ్మవారి జాతరలో సాంప్రదాయంగా వస్తున్న ఈ అమ్మవారి జాతరకి పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక అనువాయితీగా వస్తుంది. దీనికి తగ్గట్టుగానే అమ్మవారి జాతరలో పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఆలయ అధికారులు. ఈ జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి సిరిమాను జాతరను ఆలయ ప్రధాన పూజారైనటువంటి బంటుపల్లి వెంకట్రావు ఎనిమిదవ సారి సిరిమాను ను అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనం ఇవ్వనున్నారు.
ఈ ప్రధాన ఘట్టమైన సిరిమాను ఆలయ సంస్కృతి, సాంప్రదాయాల భాగంగా ఎప్పటిలాగే జరుపనున్నారు. గజపతిరాజు ఆడపడుచు అయినటువంటి ఇప్పటి పైడితల్లి అమ్మవారి పండుగకు గజపతిరాజు వారసులు మరియు ఆలయ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి సమక్షంలో జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే అదితి గజపతిరావు ఇప్పటికే ఆలయానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు. కాబట్టి జాతరకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క జాతరకి చాలా రాష్ట్రాల నుండి భక్తులు రావడంతో అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆలయ అధికారులు చెబుతున్నారు.