Navratri 2024 : నవరాత్రులలో ఏ రోజున ఏ అమ్మవారిని పూజిస్తారు?.. ఎటువంటి నైవేద్యాలు పెడతారు?
దీంతో ఇవాల్టి నుంచి నవరాత్రులు అనేవి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క నవరాత్రులు అనేవి అక్టోబర్ మూడో తారీకు నుండి మొదలయ్యి అక్టోబర్ 12 వ తారీఖున ముగిసిపోతాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి 10 రోజులు ఎంతో ఘనంగా అమ్మవార్ల ఆలయంలో ప్రజలు ఎంతగానో ఉత్సవాలనేవి చాలా చక్కగా నిర్వహిస్తారు. ఈ పది రోజులు పాటు ఉదయాన్నే ఆడవాళ్లు తలస్నానాలు చేసి స్వామివారికి నైవేద్యాలతో ఎంతో ఘనంగా పూజలు చేస్తూ ఉంటారు.
పాడ్యమి నుండి దశమి వరకు జరిగే ఈ శరన్నవరాత్రులలో అమ్మవారు చాలా రకాల అలంకారాలతో ప్రజలకు దర్శనం ఇస్తారు. మన శాస్త్రం ప్రకారం దసరా సందర్భంగా పది రోజుల పాటు అమ్మవారికి పది రకాల అలంకారాలు చేసి ఈ పది రోజులపాటు వివిధ నైవేద్యాలను అందిస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం ఇష్టం లాగా జరిపిస్తూ పెడుతుంటారు. అసలు ఈ నవరాత్రులు అంటే ఏ రోజున ఎవరిని పూజిస్తారు అలాగే ఎటువంటి నైవేద్యాలు పెడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే మొదటిగా ఈ దసరా అనగానే మొదటగా గుర్తుకొచ్చే అమ్మవారి కనకదుర్గమ్మ. ఈ కనకదుర్గమ్మ ఆలయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ నవరాత్రులలో అమ్మవారిని ఈ వాక్యాలతో పూజిస్తారు.
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్... అంటూ భక్తులు పూజించనున్నారు.
మొదటిరోజు
నవరాత్రుల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అమ్మవారిని పూజిస్తారు. అలాగే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః అనే మంత్రంతో ఈ అమ్మవారిని పూజిస్తారు. అలాగే తీపి పొంది మరియు శనగలు ఈ అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజించడం వల్ల పూర్ణఫలం అందిస్తుందని ఇక్కడ భక్తులకు విశ్వాసం. అలాగే ఈ మొదటి రోజున అమ్మవారిని రెడ్ కలర్ చీరతో అలంకరిస్తారు.
రెండవ రోజు
రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు అమ్మవారు. ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః అనె మంత్రంతో జపిస్తారు. అలాగే రవ్వ కేసరి పులిహారతో నైవేద్యంగా పెడతారు. అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం కలుగుతుందని అందరూ అంటుంటారు. అలాగే ఈ అమ్మవారిని బ్లూ కలర్ చీరతో అలంకరిస్తారు.
మూడవరోజు
మూడవరోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు కి పొంగలి నైవేద్యం గా పెడతారు. అలాగే ఈ అమ్మవారిని ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అనే మంత్రంతో జపిస్తారు. అలాగే ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే పంట పొలాలు అనేవి మంచిగా పండుతాయని అందరికీ నమ్మకం.
నాలుగో రోజు
నాలుగో రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని ఓం శ్రీ లక్ష్మీ త్రిపుర సుందరీ దేవియే నమః అని స్మరిస్తూ మంత్రిస్తారు. అలాగే అమ్మవారికి పులిహోర అలాగే పెసర బూరెలు నైవేద్యంగా పెడతారు. అలాగే ఆరోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరతో అలంకరిస్తారు.
ఐదవ రోజు
ఐదవ రోజున శ్రీ మహా చండీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఓం శ్రీ మహా చండీ దేవియే నమః అనే మంత్రంతో పూజిస్తారు. ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. చెడును అంతం చేయడానికి అమ్మవారి రూపంలో వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. అలాగే లడ్డు ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
ఆరవ రోజు
ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారి దర్శనం ఇస్తారు. ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే మంత్రంతో పూజిస్తారు. క్షీరన్నం అలాగే చక్ర ప్రసాదంతో అమ్మవారికి నైవేద్యం పెడతారు. పింక్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే ఈ అమ్మవారిని దర్శించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం.
ఏడవ రోజు
ఏడవ రోజున శ్రీ సరస్వతి దేవి అమ్మవారిగా దర్శనమిస్తారు. ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః అనే మంత్రంతో పూజిస్తారు. అలాగే అటుకులు,బెల్లం, కొబ్బరి ప్రసాదం తో నైవేద్యం పెడతారు. తెలుపు రంగు చీరతో ఆ రోజున అమ్మవారిని అలంకరిస్తారు.. అలాగే ఈ అమ్మవారిని పూజించడం వల్ల పిల్లలు లేదా పెద్దలు విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధిస్తారు.
ఎనిమిదవ రోజు
ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గా దేవిగా దర్శనమిస్తారు. అలాగే ఓం శ్రీ దుర్గా దేవియే నమః అనే మంత్రంతో పూజిస్తారు. అలాగే ఈ అమ్మవారికి అల్లం, గారెలు, నిమ్మకాయ ప్రసాదంతో నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. ఈ అమ్ము అని పూజించడం వల్ల శక్తి స్వరూప వంతులుగా మారుతారని అందరి నమ్మకం.
9వ రోజు
9వ రోజున శ్రీ మహిషాసుర మర్దిని గా అమ్మవారి దర్శనం ఇస్తారు. ఈ రోజున అమ్మవారిని ఓం శ్రీ మహిషాసుర మర్దినియే నమః అనే మంత్రంతో పూజిస్తారు. అలాగే ఈ అమ్మవారికి ఆ రోజున చింతపండు అలాగే పులిహోర మరియు చక్ర పొంగలి నైవేద్యంగా పెడతారు. అమ్మవారిని ఆరోజున ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. అమ్మవారిని దర్శించడం వల్ల జీవరాశుల కష్టాలు అన్ని తొలగిపోతాయని అందరూ నమ్ముతుంటారు.
పదవరోజు
ఈ అమ్మవారు పదో రోజున రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవియే నమః అనే మంత్రంతో పూజిస్తారు. అమ్మవారికి పులిహోర మరియు గారాలతో నైవేద్యం పెడతారు. ఆరోజున అమ్మవారిని పచ్చ రంగు చీరతో అలంకరిస్తారు. ఈ యొక్క అమ్మవారిని దైవంతో ఇష్టముగా కొలిస్తే శుభము మరియు విజయాలను చేరువు చేస్తుందని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు.
ఇలా పది రోజులపాటు ప్రతి ఒక్క మనిషి కూడా ఈ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. పది రోజులు పాటు పదిరకాల అమ్మవారి దర్శనాలను పొందుతారు. ప్రతిరోజు ఎంతో దైవ భక్తితో ప్రసాదాలను తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి అని మంచి కోరుకుంటూ ఉంటారు. ఈ దసరా అనేది కేవలం భక్తికి మాత్రమే కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 10 రోజులపాటు అందరూ ఇంటి దగ్గరే ఉంటూ కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా చుట్టాల ఇంటికి వెళ్తూ బంధువులతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా దసరా సెలవులు సందర్భంగా జరుపుకుంటారు.