Puranam: మన పురాణాల ప్రకారం ఇప్పటికీ 8 మంది బతికే ఉన్నారట?... మరి వాళ్ళు ఎవరో మీకు తెలుసా?
మన పురాణాల ప్రకారం ఇప్పటికీ కూడా ఒక 8 మంది జీవించె ఉన్నారట. అయితే చాలామంది ఈ విషయాన్ని నమ్మలేరు. కానీ ఇది అక్షర సత్యం అని మరి కొంతమంది అంటున్నారు. మనిషి అన్నకు ఒకసారి మరణిస్తే మళ్ళీ బ్రతికేటు వంటి అవకాశాలు అనేవి అసలు లేవు. అయితే మరి కొంతమంది మాత్రం పూజలు లేదా చేతబడులు అంటూ మళ్ళీ బ్రతికించవచ్చని కొన్ని అబద్ధాలు చెబుతూ ఉంటారు. కానీ మన పురాణాలు ప్రకారం నిజంగానే కొంతమంది బతికే ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బలి చక్రవర్తి
ఈ బలి చక్రవర్తి అనే అతను ఇప్పటికీ కూడా జీవించే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇతను మూడు అడుగుల స్థలం కోరి వామునుడి రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్కబడిన బలిచక్రవర్తి అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఏదో ఒక రోజున బలి చక్రవర్తి పాతాళ లోకం నుండి భూమి పైకి వస్తాడట. అదే రోజు నా కేరళ ప్రజలు ఓనం పండుగ జరుపుకుంటారు.
విభీషణుడు
విభీషణుడు రావణుడి తమ్ముడు. ఇతను రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాడు. ఇతను రామాయణ యుద్ధంలో శ్రీరాముడికి సహకరిస్తాడు. దీంతో రాముడు అతనికి మరణం అనేది లేకుండా చేస్తాడు. ఇప్పటికీ కూడా విభీషణుడు పలుచోట్ల తిరుగుతూ ఉంటాడని అందరూ అంటూ ఉంటారు. అయితే ఇతనికి ఒకే ఒక దేవాలయం రాజస్థాన్లో కలిగి ఉంది.
పరుశరాముడు
శ్రీ మహావిష్ణువుకు ఉన్న పది అవతారాలలో పరిశురామ అవతారం ఒకటి. ఇతను ఏకంగా 21సార్లు విశ్వంలో ఉన్న చక్రవర్తులందరినీ జయిస్తాడు . అయితే ఇతనికి కూడా ఒక వారం ఉంది ఇప్పటికీ మృత్యుంజయుడులా పలుచోట్ల తిరుగుతూ ఉంటాడట. కాబట్టి ఇతనిని కూడా మనం జీవించే ఉన్నాడని చెప్పుకోవచ్చు.
వేద వ్యాసుడు
మహాభారతం చెప్పినటువంటి వేద వ్యాసుడు కూడా మృత్యుంజయుడు అట. ఇతడు ఇప్పటికే జీవించే ఉన్నాడు. కాబట్టి ఇతనికి మరణం లేదట.
అశ్వద్ధామ
ఇతని గురించి మనం ఈ మధ్య వచ్చినటువంటి కల్కి మూవీలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇతను గురించి స్పెషల్గా ఎప్పటికీ జీవించే ఉంటాడని ఇతనికి మరణం లేదని కల్కి మూవీలో కూడా చెప్పారు. ఇతను ద్రౌపది కుమారులను నిద్రలోనే చంపుతాడు. మహాభారతంలో అశ్వద్ధామది ఒక ముఖ్యపాత్ర.కృష్ణుడు అశ్వద్ధామ కి ఎప్పుడు కూడా జీవించే ఉంటాడని శాపం పెడతాడు. దానివల్ల అశ్వద్ధామ ఎప్పటికీ బతికే ఉన్నాడు.
కృపాచార్యుడు
ఈ కృపాచార్యుడు అనే వ్యక్తి కౌరవులకు మరియు పాండవులకు గురువు. ఇతను ద్రోణాచార్యులకు బంధువు. ఇతనికి కూడా ఇప్పటికీ మరణం లేదట.
మార్కండేయ మహర్షి
ఇతను చిన్న వయసులోనే నాకు మృత్యువు ఉందని తెలుసుకొని మార్కండేయుడు శివుడికై తపస్సును ప్రారంభించి శివుడు మెచ్చుకొని అతనికి మృత్యుంజయ వరమనేది ఇస్తాడు. దీంతో మార్కండేయుడు అనే వ్యక్తి ఇప్పటికీ కూడా జీవించే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయ్.
ఆంజనేయస్వామి
ఇందులో ఉన్న వారు ఎవరు తెలిసినా తెలియకపోయినా ఆంజనేయస్వామి అయితే భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కలియుగ దైవంగా పిలుచుకునే ఆంజనేయస్వామిగా గుర్తింపు పొందిన ఆంజనేయుడు కూడా మృత్యుంజయుడని పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయుడికి కూడా మరణం లేదు అలాగే రాదు కూడా.
మన భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు చిత్రవిచిత్రాల అయినటువంటి వి అన్నీ కూడా కనిపెడుతూ ఉంటారు. కానీ ఎన్నేళ్లయినా సరే మనిషి మరణాన్ని అయితే ఆపకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. ఎన్నో రకాలు మందులు అలాగే జీవనశైలిని మార్చుకునే వస్తువులను కనిపెట్టే శాస్త్రవేత్తలు కూడా ఈ మరణాన్ని ఆపకుండా మాత్రం చేయలేకపోతున్నారు. కాబట్టి పురాణాల ప్రకారం ఈ యొక్క ఎనిమిది మంది మాత్రం ఇప్పటికే జీవించి ఉన్నారు. అయితే ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మరణం అనేది సహజం. దీన్ని మాత్రం ఎవరూ ఆపలేరని చాలా వాటిల్లో రాసి ఉంది.