Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు ముహూర్తం ఖరారు... అలాగే ఈ పుష్కరాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
గోదావరి పుష్కరాల ముహూర్తం
గోదావరి పుష్కరాల ముహూర్తం అయితే దాదాపుగా ఖరారు అయిందని చెప్పాలి. 2027 వ సంవత్సరంలో జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఈ గోదావరి పుష్కరాలు అనేవి జరుగుతాయని అధికారులు నిర్ణయించారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయడం కూడా మొదలు పెట్టింది. 2017లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేలా చోటు చేసుకున్న ఘటనలు విషాదం చాలా మందిలోనూ బాధను మిగిల్చాయి. కానీ ఈసారి ఈ పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని ఇప్పటికే ప్రభుత్వాధికారులు అంచనా వేశారు. కాబట్టి అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు.
ఈ ఏడాది గోదావరి జిల్లాలో పుష్కర గాట్ల అభివృద్ధికి దాదాపుగా ప్రభుత్వం 904 కోట్లతో అధికార యంత్రాంగం అనేది సిద్ధం చేసింది. సుమారు రెండున్నర ఏళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ముందస్తు భాగంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు ఇప్పటినుంచి రంగంలోకి దిగారు. దీంతో పుష్కర ఏర్పాట్ల పైన కీలక నిర్ణయాలనేవి తీసుకున్నారు.
పుష్కరాలకు నిధుల ఏర్పాటు
ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి ఈ గోదావరి పుష్కరాలకు జనం ఎక్కడి నుంచో చాలామంది వస్తూ ఉంటారు. అలాగే అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా అంతా సిద్దమయింది.అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయుచని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 17 గాట్లకు రోజుకు 75,11,616మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
అంతేకాకుండా కొత్తగా నాలుగు ఘాట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే యాత్రికులు నివాసం ఉండేటందుకు ఏర్పాట్లు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. రాజమహేంద్రవరం పరిధిలో ఉన్నటువంటి గోదావరి ఘాట్ల అభివృద్ధికి ఇప్పటికీ 904 కోట్లతో బడ్జెట్ అనేది ప్రతిపాదించారు. ఇంకా కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి 456 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి 678 కోట్లు కేటాయించి పనులను ప్రారంభించారు. ఇక అలాగే సిటీ బ్యూటీస్కేషన్ మరియు ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్ట్ కోసం 75 కోట్లు కూడా ప్రతిపాదించారు.
పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు
ఈసారి గోదావరి పుష్కరాలకు ముందుగానే అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు,హానికరం కలగకుండాఇప్పటినుంచి రద్దీపై అలాగే ట్రాఫిక్ నియంత్రణ గురించి అధికారులు ఆలోచనలో ఉన్నారు. గోదావరి పుష్కరాలు 2047కు విజనరీతో ముందుకు వెళ్ళనున్నారు అని ప్రభుత్వాధికారులు చేపట్టారు. దీనికి సంబంధించిన నిధులను సమీకరించుకొని సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాలపైన ఉన్నత స్థాయిలో సమీక్ష జరనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
ప్రతి 12 ఏళ్లకు వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు అనేవి ప్రజలందరిలోనూ ఒక పండుగలా ఉంటుంది. ఇలాంటి పండుగను అన్ని రాష్ట్రాల నుండి ఈ ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునేటువంటి ఆలోచనలు కూడా ఉండే ఉంటాయి. ఈ గోదావరి పుష్కరాల్లో స్నానం చేయడం అనేది కొంతమందికి ఒక ఆచారంలా ఉంటుంది. కాబట్టి దేశ విదేశాల నుండి కూడా దాదాపుగా కొన్ని కోట్లలో ఈ పుష్కరాలకు ప్రజలు హాజరవుతూ ఉంటారు.
దాదాపుగా పది రోజులు పాటుగా ఈ పుష్కరాలు అనేవి ఘనంగా నిర్వహిస్తారు. కేవలం ఈ పది రోజుల్లోనే కొన్ని కోట్ల మంది భక్తులు ఈ గోదావరి నది లో స్నానాలను చేయడానికి వస్తూ ఉంటారు. అయితే కథ గోదావరి పుష్కరాలలో చాలానే కుటుంబాలలో విషాదాలు నెలకొన్నాయి. కానీ ఈసారి అలా జరగకుండా ప్రభుత్వాధికారులు అలాగే ప్రభుత్వ యంత్రాంగాలు అన్నీ కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి పుష్కరాల్లో పాల్గొనడానికి మొగ్గు చూపుతారు.